Mass Jathara: మాస్ జాతర.. ఈసారి కూడా బిగ్ టార్గెట్!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)  మరోసారి తన స్టైల్‌లో మాస్ ఫెస్టివల్‌కి రెడీ అవుతున్నాడు. ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే క్రేజీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. తన ఎనర్జీ, మాస్ యాటిట్యూడ్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ, ఈ సినిమా పూర్తిగా రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్నాడు.

Mass Jathara

రవితేజ బాక్సాఫీస్ వద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ తరుణంలో, మాస్ జాతర సినిమాను పూర్తి ప్లాన్ తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధమాకా లాంటి 100 కోట్ల హిట్ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా వర్క్ అవ్వకపోవడంతో, రవితేజ ఈ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు. పక్కా ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో 100 కోట్లు కొట్టేలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శ్రీలీల (Sreeleela) నటిస్తుండగా, ఈ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో కనిపిస్తాడని టాక్. షూటింగ్ సమయంలో రవితేజ భుజానికి గాయం కావడంతో సినిమా లేట్ అయినా, ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉందట. టైటిల్ లాగానే ఈ సినిమా కూడా ఓ పక్కా మాస్ ఫెస్టివల్ లా ఉండనుందని, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ తో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తుందని ఇండస్ట్రీ టాక్.

మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్న మేకర్స్, ఆ అప్డేట్ తో సినిమాపై అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. చివరగా, మాస్ జాతరతో రవితేజ మళ్లీ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతాడా? అనేది వేచి చూడాల్సిందే.

ఎన్టీఆర్ – నీల్.. అసలు కథ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus