మహేష్ మూవీకి రష్మిక భారీ పారితోషికం

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ‘ఛలో’ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యి… వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో నాగశౌర్య కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక అటుతరువాత విడుదలైన ‘గీత గోవిందం’ చిత్రం కూడా 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి మీడియం రేంజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక అటుతరువాత ‘దేవదాస్’ వంటి క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఇక రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ లో నటిస్తూనే… ‘మహేష్ 26’ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడమంటే అంత తేలికైన విషయం కాదు. అప్పట్లో సమంతకు మాత్రమే ఫాస్ట్ గా మహేష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఇప్పుడు మళ్ళీ రష్మిక కు మాత్రమే దక్కింది. అంతేకాదు ఈ చిత్రంకోసం రష్మిక కు పారితోషికం కూడా గట్టిగానే ఇస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. కోటి రూపాయలకి పైగా ఆమెకు పారితోషికం ముట్టనుందని సమాచారం. అసలే ‘గోల్డెన్ లెగ్’ అందులోనూ ఈ గీత మేడం కి యూత్ లో పిచ్చ క్రేజ్ ఉంది. కాబట్టే నిర్మాతలు ఆమె అడిగినంతా ఇస్తున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus