హాట్ టాపిక్ గా మారిన రష్మిక రెమ్యునరేషన్!

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతుంది నటి రష్మిక. ఈ ఏడాదిలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ లాంటి చిత్రాలలో నటించి తన ఖాతాలో రెండు హిట్లు వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కి రీచ్ అవుతోన్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచేస్తుందని టాక్. శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించనున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు.

దసరా కానుకగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా వెంకటేష్ చేయాల్సింది కానీ ఫైనల్ గా శర్వానంద్ దగ్గరకి వచ్చింది. ఈ సినిమాలో నటించడానికి రష్మిక భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏకంగా రూ.1.20 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. కరోనా కాలంలో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ లో ఇరవై శాతం వరకు తగ్గించి ఇవ్వాలని ఇండస్ట్రీ భావిస్తుంటే..

రష్మిక మాత్రం ఈ రేంజ్ లో డిమాండ్ చేసిందనే వార్త షాక్ కి గురిచేస్తోంది. ఇదే గనుక నిజమైతే.. రష్మిక ఇప్పటివరకు తీసుకున్న రెమ్యునరేషన్ లో ఇదే హయ్యెస్ట్ అవుతుంది. మరి దీనిపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి. ఎస్.ఎల్.వి.సి బ్యానర్‌లో నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus