Rashmika: పోటీలో కూడా పెద్ద సినిమాలు పడుతుందిగా..!

హీరోయిన్ల లైఫ్ టైం గట్టిగా 5 ఏళ్ళు అంటుంటారు ఇండస్ట్రీలో..! వాళ్ళు ఏం సంపాదించుకోవాలన్నా ఆ 5 ఏళ్లలోనే సంపాదించుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు కదా..! అలా అన్నమాట. ఈ ఫార్ములాని తూచా తప్పకుండా పాటిస్తుంది రష్మిక (Rashmika) . కృతి శెట్టి (Krithi Shetty) , శ్రీలీల (Sreeleela) వంటి హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చాక రష్మిక హవా కాస్త తగ్గినట్టే కనిపించింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా తెలుగులో మంచి ఆఫర్లు అందుకుంటుంది. కాబట్టి రష్మిక పనైపోయినట్టే అనే కామెంట్లు మొన్నామధ్య వినిపించాయి.

కానీ ‘యానిమల్’ తో (Animal) ఈమె మళ్ళీ పుంజుకున్నట్టు కనిపిస్తుంది. ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో ఆమె రెచ్చిపోయి నటించింది. తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా రష్మిక పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఇప్పుడు ‘పుష్ప 2 ‘ లో (Pushapa 2) కూడా రష్మిక – బన్నీ..ల (Allu Arjun) మధ్య రొమాంటిక్ సీన్స్ డోస్ పెంచాడు. కాకపోతే ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.

మరోపక్క ధనుష్ (Dhanush) – నాగార్జున..ల (Nagarjuna) ‘కుబేర’, ‘గాళ్ ఫ్రెండ్’ ‘రెయిన్ బో’ వంటి సినిమాల్లో కూడా నటిస్తుంది రష్మిక. ఇక హిందీలో అయితే సల్మాన్ ఖాన్ (Salman Khan), విక్కీ కౌశల్ (Vicky Kaushal) వంటి హీరోల సినిమాల్లో కూడా నటిస్తుంది. సో రష్మికకి ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఒకవేళ ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కనుక హిట్ అయ్యి..వాటిలో ఈమె చేస్తున్న పాత్రలు కనుక క్లిక్ అయితే.. మళ్ళీ ఈమె ఫామ్లోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus