అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి రష్మిక. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే ఈ బ్యూటీ సినిమాకి రెండు కోట్లు చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే తనకు చాలా హ్యాపీ అని చెబుతోంది రష్మిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక రూ.2 కోట్ల రెమ్యునరేషన్ పై స్పందించింది. అందులో నిజం లేదని.. కేవలం తన కల మాత్రమేనని..
చాలా మంది హీరోయిన్లతో తన రెమ్యునరేషన్ ని పోలుస్తున్నారని చెప్పింది. తన కష్టానికి, పాపులారిటీకి తగ్గ పేమెంట్ ఇస్తున్నారని.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పింది. అందరూ అనుకుంటున్నట్లుగానీ రూ.2 కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తను కొత్త కథలు వినడం మానేశానని.. అంగీకరించిన సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పింది. ఇలాంటి సమయంలో కొత్త కథలు విని.. ప్రొడక్షన్ హౌస్ ను వెయిటింగ్ లో పెట్టలేనని చెప్పుకొచ్చింది.
తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. సౌందర్య, శ్రీదేవి బయోపిక్ లలో నటించే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనని..నటిగా నిరూపించుకోవడానికి అలాంటి బయోపిక్స్ హెల్ప్ చేస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది రష్మిక. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.