Rashmika Mandanna: 400 కోట్ల బడ్జెట్.. రష్మిక సేవ్ చేయగలదా?

Ad not loaded.

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే యానిమల్ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసి హిందీ చిత్రసీమలో రికార్డు నమోదు చేసింది. అంతకు ముందు విడుదలైన సౌత్ సినిమాలు కూడా నార్త్ మార్కెట్‌లో బాగా ఆడాయి. అయితే, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తాజా చిత్రం సికిందర్ (Sikandar) మాత్రం భిన్నమైన హైప్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజయం అటు సల్మాన్ కు ఇటు మురగదాస్ కి  (A.R. Murugadoss) చాలా కీలకం.

Rashmika Mandanna

ఈ చిత్రంలో సల్మాన్ సరసన రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు భారీ హిట్ అవ్వడం ఆమెకు లక్కీ హీరోయిన్ అనే పేరు తెచ్చిపెట్టింది. యానిమల్ (Animal బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో, రష్మిక ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు నమ్మకస్తురాలిగా మారింది. ఇక పుష్ప 2 కూడా 1800 కోట్లు దాటు రికార్డులు క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన చావా కూడా ఇప్పటికే 150 కోట్లకు చేరువైంది.

వీటన్నింటిని బట్టి చూస్తే, రష్మిక ఓ సినిమా చేస్తే దానికి వసూళ్లు బాగుంటాయని ఫిల్మ్ మేకర్స్ నమ్ముతున్నారు. అయితే, సికిందర్ సినిమా రష్మిక విజయాలను కొనసాగిస్తుందా? లేక మిగతా బాలీవుడ్ సినిమాల్లా మిశ్రమ స్పందన అందుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు తేలిపోయిన విషయం తెలిసిందే. దీంతో 400 కోట్ల ప్రాజెక్ట్ అయిన సికిందర్ పైనే మేకర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా సక్సెస్ అయితే, సల్మాన్ ఖాన్ మళ్లీ హిట్ ఫామ్‌లోకి వస్తాడు. అదే ఫ్లాప్ అయితే, బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు రిస్క్ పెరుగుతుందనే అభిప్రాయం బలపడుతుంది. ఇక రష్మిక పాత్ర ఈ సినిమాలో ఎంత ముఖ్యమో ఇంకా స్పష్టత లేదు. బాలీవుడ్ మేకర్స్ మిగతా హీరోయిన్లను అటాచ్మెంట్‌గా చూపించే ట్రెండ్ పాటించకుండా, ఆమెకు ఒక స్ట్రాంగ్ రోల్ ఇచ్చారా అన్నది చూడాలి. కానీ, ప్రస్తుతానికి ఫిల్మ్ మేకర్స్ రష్మిక క్రేజ్‌ను తమ సినిమాకు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఆమె లక్ బాలీవుడ్‌లో మరోసారి పనిచేస్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus