‘భీష్మ’ కోసం రష్మిక స్పెషల్ ఇంటర్వ్యూ..!

జనవరిలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక మందన. ఇప్పుడు ఫిబ్రవరిలో మరో హిట్ అందుకోవడానికి రెడీ అయిపొయింది రష్మిక. అవును ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘భీష్మ’. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకీ కుడుములు దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం గ్లిమ్ప్స్, టీజర్, మరియు 3 పాటలకు అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెబుతుంది హీరోయిన్ రష్మిక. ‘భీష్మ’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రష్మిక కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది.

‘కుక్క బిస్కట్ల’ విషయంలో అలా దొరికేసాను ఏంటి అని ఫీలయ్యారా?

నేనేదో చిన్న పీస్ టేస్ట్ చేశాను. అంతే నితిన్ బయట పెట్టేసాడు. అది కాస్త వైరల్ అయిపొయింది. నేను కూడా నితిన్ సీక్రెట్ ఒకటి తెలుసుకుని బయటపెట్టేస్తాను.(నవ్వుతూ)

వాలెంటైన్స్ డే రోజున ఎలా ఎంజాయ్ చేశారు..?

మార్నింగ్ జిమ్ చేసి .. షూటింగ్ కు వెళదామనుకుంటే.. అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఓ రొమాంటిక్ సినిమా చూసాను.. చాలా బోరింగ్ గా అనిపించింది.

ఈ సినిమాలో డ్యాన్స్ చేయడానికి బాగా కష్టపడినట్టు ఉన్నారు?

అవునండీ.. చాలా కష్టపడ్డాను. కాళ్ళు పట్టేసాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కొంచెం ట్రై చేశాను.. ఈ సినిమాలో ఇంకాస్త ఎక్కువగా ట్రై చేశాను.

జస్ట్ 3 ఏళ్ళలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.. మీ లక్ అనుకుంటున్నారా?

మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి హార్డ్ వర్క్ చేశాను .. అంతేకాని లక్ ఎక్కడ. సరైన కథ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంతో కష్టపడాలి కదా…!

దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రెండో సారి చేస్తున్నారు.. ఆయనలో ఏమైనా మార్పులు గమనించారా?

‘ఛలో’ తర్వాత వెంకీ డైరెక్షన్లో చేస్తున్నాను. ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. చాలా కామ్ గా ఉంటారు.. స్క్రిప్ట్ పై చాలా వర్కౌట్ చేస్తారు.

హీరో నితిన్ లవ్ మ్యాటర్ మీకెప్పుడు తెలిసింది..?

జస్ట్ ఆయన ఎంగేజ్మెంట్ కు.. రెండు రోజుల ముందు తెలిసింది. నాకు కూడా ఏమీ చెప్పలేదు అతను..! సినిమాలో సింగిల్ ఫరెవర్ అన్నాడు.. తీరా చూస్తే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నేను .. నా డైరెక్టర్ మాత్రమే సింగిల్స్ ఇక్కడ(నవ్వులు).

పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయని.. చిన్న సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారంట నిజమేనా..?

ఇప్పటికి 50 స్క్రిప్ట్ లకు పైనే రిజెక్ట్ చేశాను. అలా అని మంచి స్క్రిప్ట్ ను నేను ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు. తక్కువ టైములో నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే.. బాగాలేని స్క్రిట్ లను నేను రిజెక్ట్ చేయడం వల్లనే అని నేను అనుకుంటాను.

మీ పై ఐటీ రైడ్స్ జరిగేంత సంపాదించారా.. ఈ మూడేళ్ళలో? (నవ్వుతూ)

నా పై ఐటీ రైడ్స్ జరిగిన మాట నిజం. పాపం వాళ్ళకి ఏమీ దొరకలేదు(నవ్వుతూ). నా తండ్రి ఓ వ్యాపారవేత్త కావడం… నేను ఓ క్రేజీ హీరోయిన్ కావడంతో బహుశా రైడ్ చేశారేమో.. కానీ పాపం వాళ్ళకి ఏమీ దొరకలేదు(మళ్ళీ నవ్వులు)

‘భీష్మ’ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు చైత్ర. నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డ్యాన్స్ బాగా చేశాను..యాక్టింగ్ కూడా బాగా చేశాను.

హిందీ ‘జెర్సీ’ చిత్రాన్ని రిజెక్ట్ చేసారంట నిజమేనా?

అవును ఆ టైములో.. నేను ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘సుల్తాన్’ (తమిళ్) చిత్రాలకు కమిట్ అవ్వడంతో … ‘జెర్సీ’ (హిందీ) చేయడానికి ఒప్పుకోలేదు.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.. గురించి చెప్పండి?

ఇప్పుడు తమిళ్ లో కార్తీ మూవీ ఒకటి చేస్తున్నాను.. తరువాత బన్నీ, సుకుమార్ మూవీ కూడా చెయ్యాల్సి ఉంది. మార్చి నుండీ ఆ ప్రాజెక్ట్ మొదలుకాబోతుంది.

– Interview by Phani Kumar

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus