సొంత డబ్బింగ్ చెప్పుకుంటానంటున్న కన్నడ బ్యూటీ

భాషా బేధం లేకుండా మన తెలుగువాళ్లు అందరు హీరోయిన్లని ఆదరిస్తారు. మరీ తమిళ ప్రేక్షకుల్లా గుడులు కట్టే స్థాయి ప్రేమ ప్రదర్శించకపోయినా.. మనసుల్లో మాత్రం బిల్డింగులు కట్టేసుకొని ఆరాధించేస్తుంటారు. అందుకేనేమో హీరోయిన్లు కూడా మన తెలుగు ప్రేక్షకులకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. పరాయి భాషల్లోనో లేక తమ మాతృ భాషలోనో అద్భుతమైన అవకాశాలు వేచి చూస్తున్నప్పటికీ.. తెలుగులో నటించడానికే మొగ్గు చూపుతుంటారు. అయితే.. ఈమధ్యకాలంలో తమ అందంచందాలు, అభినయం మాత్రమే కాకుండా తన గొంతు కూడా తెలుగు ప్రేక్షకులు వినేలా జాగ్రత్తపడుతున్నారు హీరోయిన్లు.

ఎవరో ఇద్దరుముగ్గురు సీనియర్ హీరోయిన్లు తప్ప ఇప్పుడొస్తున్నవాళ్ళందరూ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు ఆల్రెడీ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో కన్నడ బ్యూటీ రష్మిక కూడా చేరనుంది. ఆల్రెడీ తెలుగులో “ఛలో, గీత గోవిందం” చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకొన్న రష్మిక ఇప్పుడు తెలుగులో “దేవదాస్” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలవుతుండగా.. ఈ చిత్రం కోసం రష్మిక సొంతంగా డబ్బింగ్ చెప్పుకొనేందుకు సన్నద్ధమవుతోందట. ఆల్రెడీ తెలుగులో బాగానే మాట్లాడే రష్మిక తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus