ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల సరసన అవకాశం అందుకున్న రష్మిక

అప్పటికే కన్నడలో సూపర్ స్టార్ డమ్ తోపాటు భారీ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మండన్న తెలుగులో తన పరిచయ చిత్రమైన “ఛలో” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. “నేను “నా పేరు సూర్య” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యాను, ఫోటోషూట్ కూడా జరిగింది. కానీ ఎందుకో సినిమాలో నా బదులు అను ఎమ్మాన్యూల్ ని సెలక్ట్ చేసుకున్నారు” అని చెప్పుకొని బాధపడిన విషయం కొందరికైనా గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అల్లు అర్జున్ సరసన ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు రష్మిక బాధపడినా కూడా.. ఆ సినిమా ఫెయిల్ అయినందుకు తప్పించుకొన్నాననుకొంది.

అయితే.. రష్మిక బాధను చూసి చలించిపోయాడో లేక “గీత గోవిందం” చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ముగ్ధుడయ్యాడో తెలియదు కానీ.. అల్లు అర్జున్ ఆమెను తన తాజా చిత్రంలో కథానాయికగా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రష్మికను ఫైనల్ చేశారట. అలాగే.. అఖిల్ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం మరియు మహేష్ బాబు-అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకి కూడా హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది. దాంతో ఒకేసారి ముగ్గురు హీరోలు.. మహేష్ బాబు, అల్లు అర్జున్, అఖిల్ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని మోస్ట్ వాంటేడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మండన్న. చూస్తుంటే.. ఇప్పుడప్పుడే రష్మిక కెరీర్ పరంగా స్లో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus