మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన..!

ప్రస్తుతం జూనియర్ సమంత అనే రేంజ్లో దూసుకుపోతుంది రష్మిక మందన. గతంలో సమంత కూడా సైలెంట్ గా వచ్చి హిట్లు మీద హిట్లు కొట్టి గోల్డెన్ లెగ్ గా చలామణి అయ్యింది. ఆమె తరువాత ఆ దిశగా దూసుకుపోతుంది రష్మిక అనే చెప్పాలి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో నటించడం.. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఆ వెంటనే అల్లు అర్జున్, కార్తీ, ఇప్పుడు సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యనే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి రష్మిక ను సంప్రదించారట దర్శకనిర్మాతలు. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లోనే ఎన్టీఆర్ ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉండగా..

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికను ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. మొదట పూజా హెగ్డే,కీర్తి సురేష్, కియారా అద్వానీ.. వంటి వారిని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న క్రేజ్ ను బట్టి రష్మిక మందన అయితేనే కరెక్ట్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఆల్రెడీ ఈ బ్యానర్లో రష్మిక ‘భీష్మ’ చిత్రం చేసింది. అది కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus