టాలీవుడ్‌లో అడుగుపెట్టి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్నా(Rashmika Mandanna), ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపిస్తోంది. పుష్ప (Pushpa) మూవీతో ఆమెకు నేషనల్ లెవెల్‌లో గుర్తింపు వచ్చేసింది. ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్ రష్మిక కోసం ప్రత్యేకంగా వచ్చిందంటే, ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా, ఈ ట్యాగ్ గురించి ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తన మొదటి సినిమా కిరిక్ పార్టీ నుంచే ఈ క్రేజ్ మొదలైందని చెప్పిన రష్మిక, “కాలేజీలో నేనే అందరి క్రష్‌ని.
ఆ తర్వాత కర్ణాటకలో క్రష్‌గా మారాను. చివరికి దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ అయ్యాను” అని చెప్పింది. అయితే ఈ ట్యాగ్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తనతో కనెక్ట్ అయ్యే విధంగా ప్రేమను పంచుకోవడం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందంటూ ఫీలింగ్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం రష్మిక ఛావా (Chhaava) మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఆమె యేసుబాయ్ పాత్రలో నటించింది.
విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. బాలీవుడ్‌లోనూ క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్న రష్మిక, ప్రస్తుతం సికిందర్ (Sikandar) అనే మూవీకి కమిట్ అయ్యింది. మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్‌కి (Salman Khan) జోడీగా నటిస్తోంది. ఇక టాలీవుడ్‌లోనూ రష్మిక పూర్తి బిజీగా ఉంది.
కుబేర (Kubera) , ది గర్ల్‌ఫ్రెండ్, రైన్‌బో సినిమాల్లో నటిస్తుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యే అవకాశముంది. పుష్ప 2 (Pushpa 2: The Rule) తర్వాత రష్మిక కెరీర్ మరింత బలపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్, సౌత్ సినిమాల్లో ఒకేసారి నిలదొక్కుకుని, తన నేషనల్ క్రష్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది.