Rashmika: గుడ్ బై ప్రమోషన్లకు ఫ్యామిలీని కూడా వదలని రష్మిక!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నేషనల్ క్రష్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రష్మిక మందన్న.ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ సరసన ఈమె నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పడటంతో ఈ ముద్దుగుమ్మకు వరుస బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక నటించిన గుడ్ బై సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇక హిందీలో ఈమె నటించడం మొదటి సినిమా విడుదల కావడంతో ఈ సినిమాపై రష్మిక ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక తన ఫ్యామిలీని కూడా వదలడం లేదు. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రియల్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ పెట్టారు.

మరో రెండు రోజులలో నా రీల్ ఫ్యామిలీని కూడా చూస్తారు అంటూ గుడ్ బై సినిమా గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ లు చేయగా మరికొందరు ప్రమోషన్ కోసం ఫ్యామిలీని కూడా వదలడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus