Rashmika: బాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న రష్మిక… మరో ఛాన్స్ పట్టేసిందిగా!

రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి రష్మిక ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయాయి అయినప్పటికీ ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి రష్మిక మరొక క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని ఎంతోమంది ఎదురుచూస్తూ ఉన్నారు.

అయితే రష్మిక (Rashmika) మాత్రం షారుఖ్ ఖాన్ తో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఇలా షారుక్ సినిమాలో రష్మిక నటించబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి రష్మిక గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది వైరల్ గా మారడంతో ఎంతోమంది రష్మిక క్రేజ్ మామూలుగా లేదని లక్ అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో పాటు రెయిన్ బో సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus