Rashmika, Allu Arjun: డిసెంబర్ 6కి అల్లు అర్జున్ రాకపోయినా.. రష్మిక వస్తానంటోంది!

శుక్రవారం, డిసెంబర్ 6, 2024 అనేది ప్రస్తుతం జనాల మెదళ్లలో నానుతున్న డేట్. సౌత్ మాత్రమే కాక నార్త్ ఆడియన్స్ కూడా “పుష్ప 2” విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. “పుష్ప 2” ఆ తేదీకి రావడం కోసం డౌటే అనే వాదనలు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో. అయితే.. ఇప్పుడు అదే తేదీకి తాను నటించే మరో సినిమా విడుదలవుతుండడంతో బన్నీ రాకపోయినా.. నేను మాత్రం పక్కా వస్తానంటోంది రష్మిక.

రష్మిక హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం “చావా” టీజర్ ఇవాళ విడుదలైంది. విక్కీ కౌశల్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ హిందీ చిత్రం మరాఠీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6కి విడుదల చేస్తున్నట్లుగా బృందం ప్రకటించింది. ఒకవేళ “పుష్ప 2” వాయిదా పడే డిసెంబర్ 6కి రష్మిక రావడం ఫిక్స్ అన్నట్లు, లేక అనుకున్న ప్రకారం “పుష్ప 2” కూడా అదే తేదీకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు రష్మికకి ఒకేరోజున రెండు రిలీజులు పడతాయి.

ఇప్పటివరకు చాలా తక్కువమందికి అలా ఒకేరోజు రెండు సినిమాలు రిలీజైన సందర్భం ఎదురైంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే.. “చావా” టీజర్ మాత్రం అదిరిపోయింది. ఛత్రపతి శివాజీ మహారాజు వారసుడు ఛత్రపతి చావాగా విక్కీ కౌశల్ లుక్ & యాక్షన్ బ్లాక్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా వందలమంది సైన్యం విక్కీ కౌశల్ తలపడే సన్నివేశం “ఆర్ఆర్ఆర్”లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ను తలపిస్తోంది.

ఆల్రెడీ ఈ ఏడాది “బ్యాడ్ న్యూస్” చిత్రంతో మంచి హిట్ అందుకున్న విక్కీ కౌశల్ “చావా”తో మరో హిట్ అందుకొనేలా ఉన్నాడు. అలాగే.. రష్మిక కూడా 2024లో ఇప్పటివరకు ఒక్క రిలీజ్ లేదు. మరి ఈ రెండు సినిమాలు ఏడాది చివర్లో విడుదలై ఆమెకు 2024లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఆమె కెరీర్ కు బూస్ట్ ఇస్తాయేమో చూడాలి!

‘మారుతీ నగర్..’ టు ‘ఇంద్ర’.. ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కాబోతున్న 18 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus