Rashmika: పుష్ప 2: డిసెంబర్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా?

  • December 2, 2024 / 05:29 PM IST

రష్మిక మందన్న (Rashmika Mandanna)  ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. జెట్ స్పీడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం రష్మిక దృష్టి అంతా పుష్ప 2 (Pushpa 2: The Rule)  పైనే ఉంది. ఈ డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ సీక్వెల్‌ లో ఆమె పాత్ర ‘శ్రీవల్లి 2.0’గా మరింత ఎమోషనల్‌గా, మెప్పించేదిగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

Rashmika

కన్నడలోని తన డెబ్యూ మూవీ కిర్రిక్ పార్టీ డిసెంబర్‌లో విడుదలై ఘనవిజయం సాధించడం నుంచి ఆమె విజయాలు ఈ నెలతో సెంటిమెంట్‌గా మారాయి. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా ఛలో విజయం సాధించినా, తర్వాతి సినిమా గీతా గోవిందంతో రష్మిక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే, ఆమె కెరీర్‌కు గేమ్ చేంజర్‌గా నిలిచిన మూవీ మాత్రం పుష్ప-1. ఈ చిత్రం ఆమెకు నేషనల్ క్రష్ అనే టైటిల్‌ను ఇచ్చింది.

రష్మిక నటించిన మరో సినిమా యానిమల్ కూడా డిసెంబర్‌లోనే విడుదలై, భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పుడు పుష్ప-2తో ఆమె డిసెంబర్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. పుష్ప-1  (Pushpa)  హిట్ తర్వాత రష్మిక నటన పట్ల నేషనల్ లెవెల్‌లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే, ఈ సారి పుష్ప-2 ఆమెకు నేషనల్ అవార్డును తీసుకువస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక పుష్ప-2లో, అల్లు అర్జున్‌తో   (Allu Arjun)  రష్మిక కెమిస్ట్రీని మరింత హైలెట్ గా చూపించనున్నారు.

శ్రీవల్లి పాత్ర కథానాయకుడితో బలమైన అనుబంధంతో ఉంటుందట. ఆమె పాత్ర కోసం ప్రత్యేకంగా గెటప్ డిజైన్ చేయడం, డైలాగ్స్‌లో ఎమోషన్ పెంచడం వంటి మార్పులు చేయడం వల్ల ఈసారి ఆమె నటన మరింత బలంగా ఉండబోతోందని సమాచారం. ఇదే సమయంలో డిసెంబర్ సెంటిమెంట్ తోడైతే, పుష్ప-2 బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లను సాధించి, రష్మిక (Rashmika) కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి డిసెంబర్ ఈసారి రష్మికకు ఎలాంటి అదృష్టం తీసుకొస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus