రథం ఫస్ట్ లుక్ రిలీజ్

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్ పై ఏ. వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాత గా తెరకెక్కుతున్న తొలి చిత్రం రథం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నూతన నటీనటులు గీత ఆనంద్, చాందిని భాగవానని నటిస్తున్నారు. చంద్ర శేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంభందించి మైఖ్య అతిధులుగా నిర్మాత నవీన్ ఎర్నేని, సీనియర్ దర్శకుడు బి. గోపాల్, ఆర్పీపట్నాయక్ హాజరయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నవీన్ ఎర్నేని విడుదల చేయగా.. సీనియర్ యాక్షన్ డైరెక్టర్ బి. గోపాల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రసాద్ ల్యాబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

రాజా దారపునేని మాట్లాడుతూ… నవీన్ గార్కి, గోపాల్ గార్కి, ఆర్పీపట్నాయక్ గార్కి.. వినోద్ గార్కి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. వచ్చే నెల రెండోవారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.. హీరో చాలా చక్కగా నటించారు. హీరోయిన్ కి మంచి ఫీచర్ ఉంది. ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి థాంక్స్ అని అన్నారు.

సమర్పకుడు వినోద్ మాట్లాడుతూ ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నా అని అన్నారు.

నటి ప్రమోదిని మాట్లాడుతూ… తల్లి కూతురు మధ్య వచ్చే సీన్స్ ని చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు చంద్ర శేఖర్. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు.

ఫసిట్ మాస్టర్ దేవరాజ్ మాట్లాడుతూ హీరో గీత ఆనంద్ యాక్షన్ సీన్స్ బాగా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని తెలిపారు.

నటి మాధవి మాట్లాడుతూ… ఈ సినిమాకు ముందు దర్శకుడు నన్ను కలిసి ఈ సినిమా చేయాలని అడిగారు. వెంటనే ఒకే చేసాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించినందుకు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని మిర్చి మాధవి అన్నారు.

నటుడు రాము మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు థాంక్స్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా అని అన్నారు.

ఆర్పీపట్నాయక్ మాట్లాడుతూ… రాజా తనకు ఇది చెప్పకుండా చేయడు… అలాంటిది ఈ సినిమా తనకు చెప్పకుండా చేసాడు.. ఈ సినిమా ఆర్ ఎక్స్ 100 సినిమా లా కమర్షియల్ హిట్ సాధిస్తుంది అని అన్నారు. సుకుమార్ సంగీతం బాగుంది. అని అన్నారు.

హీరో గీత ఆనంద్ మాట్లాడుతూ… నేను ఈ స్టేజ్ మీద ఉన్నందుకు చాలా ఎక్సయిట్ గా ఫీల్ అవుతున్న.. ఇంతకుముందు.. నేను ఓ షార్ట్ ఫిల్మ్ చేసాను..తెలిసి తెలియకో అనే మూవీ లో కూడా నటించాను. నాకు ప్రొడ్యూసర్ రాజా ఇచ్చిన అవకాశం మరువలేనిది. డైరెక్టర్ వెరీ హై ఎన్సీర్జిటిక్ అని అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ… రాజా తనకు మంచి పరిచయం ఉంది. సినిమా మంచి హిట్ సాధిస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. త్వరలో విడుదల కాబోయే ఈ సినిమా అరెక్స్ 100, అర్జున్ రెడ్డి, గూడాచారి సినిమాల్లా విజయం సాధిస్తోంది అని అన్నారు.

బి. గోపాల్ మాట్లాడుతూ… రాజా నాకు మంచి మిత్రుడు. సినిమా అంటే తనకు ప్రాణం. ఆ ఫ్యాషన్ తోనే ఇండస్ట్రీలో కి వచ్చాడు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధించాలి అని బ్లేస్ చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus