Bigg Boss 7 Telugu: రతిక ప్రశాంత్ కి హ్యాండ్ ఇవ్వడానికి అసలు కారణం ఏంటంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2వ వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ అందరూ ఓపెన్ అయ్యారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ని, తనకి సపోర్ట్ చేస్తున్న శివాజీని టార్గెట్ చేస్తూ ఇచ్చిపారేశారు. పల్లవి ప్రశాంత్ ని ఎన్ని విధాలుగా లాక్ చేయాలో అన్ని విధాలుగా లాక్ చేసేశారు. శోభాశెట్టి ముందు ఈ విషయాన్ని స్టార్ట్ చేసింది. లవ్ ట్రాక్స్ నడపడానికి వచ్చావా ? లేదా టైటిల్ విన్ అవ్వడానికి వచ్చావా అంటూ స్ట్రయిట్ గా పాయింట్ అడిగింది. దీంతో ప్రశాంత్ రతికని ప్రశ్నించాడు. నేను ఎప్పుడైనా నీకు లవ్ చేస్తున్నానని చెప్పానా అంటూ మాట్లాడాడు. దీంతో రతిక సూప్ లో పడింది.ఇక్కడున్నోళ్లు అందరూ పిచ్చోళ్లు కాదని చెప్పింది.

దీంతో శోభాశెట్టి సోఫా పైన లవ్ సింబల్ వేసి ఎందుకు రాశావ్ అంటూ రెచ్చిపోయింది. శోభా నామినేట్ చేస్తుంటే ప్రశాంత్ మీరు ఎన్నిసార్లు నామినేట్ చేసినా సరే, బయట మావోళ్లు ఉన్నారు. నన్ను కాపాడతారు అంటూ మాట్లాడాడు. దీంతో అమర్ దీప్ ఇంకా శోభా ఇదే కావాలి. అసలు నిజాలు బయటకి వస్తున్నాయ్ అంటూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత రతిక వచ్చి ప్రశాంత్ ని నామినేట్ చేసింది. ఇలా వెన్నుపోటు పొడుస్తుందని ప్రశాంత్ కలలో కూడా అనుకోలేదు. మనోడికి హార్ట్ బ్రేక్ అయిపోయి గుండెపోటు వచ్చినంత పని అయ్యింది. స్ట్రయిట్ గా ఒకటే పాయింట్ అడిగింది. రైతు బిడ్డవి కాకపోతే నువ్వెవరు అంటూ రెచ్చిపోయింది.

అంతేకాదు, బయట బిగ్ బాస్ షో అంటే బాగా ఇష్టమని చెప్పావ్, మరి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని అబద్దాలు ఎందుకు చెప్తున్నావ్ అంటూ నిలదీసింది. దీంతో ప్రశాంత్ సూప్ లో పడిపోయాడు. అసలు రతిక నామినేట్ చేయడానికి వేరే కారణం కూడా ఉంది. ఒకరోజు పల్లవి ప్రశాంత్ కెమెరాలు ఉన్నాయని, కావాలనే నేను నీతో క్లోజ్ గా ఉంటున్నాని చెప్పాడని రతిక థామినితో కిచెన్ లో చెప్పింది. అంతేకాదు, అప్పట్నుంచీ నాకు మనసు విరిగిపోయిందంటూ చెప్పుకొచ్చింది. అవకాశం వచ్చేవరకూ ఒక ప్రశాంత్, అవకాశం వచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక వేరే ప్రశాంత్ బయటకి వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు, రతిక కిచెన్ లో మాట్లాడుతూ లవ్ ట్రాక్ నడిపిస్తే కెమెరాలు తనపై ఫోకస్ ఉంటాయని అనుకున్నాడని అందుకే అలా చేశాడని ఓపెన్ గా చెప్పింది. ఇదే రతిక నామినేట్ చేయడానికి కారణం అని తనే క్లియర్ గా చెప్పింది. దీంతో పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వీక్ లో సంపాదించిన సింపతీ మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది. మరి ఈవారం తన ఓటింగ్ గ్రాఫ్ అలాగే ఉంటుందా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus