Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో రివర్స్ అయిన రతిక..! వెక్కి వెక్కి ఏడ్చిన పల్లవి ప్రశాంత్..!

బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం నామినేషన్స్ రసవత్తరంగా జరిగాయి. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ హైలెట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ లో రతిక చుట్టూ తిరిగిన పల్లవి ప్రశాంత్ కి షాక్ తగిలింది. నామినేషన్స్ లో రతిక పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే., అమర్ దీప్ నామినేషన్స్ చేస్తూ పల్లవి ప్రశాంత్ తో చాలాసేపు ఆర్గ్యూమెంట్ చేశాడు. రైతుబిడ్డ అనే సింపథీ కార్డ్ ని ఇక నుంచీ వాడద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయి ఆర్గ్యూమెంట్ కి దిగాడు. ఇద్దరికీ మాట మాట పెరిగింది.

నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అని, బిగ్ బాస్ సెట్ చుట్టూ ఎన్ని సంవత్సరాలు కుక్కలా తిరిగానో మీకు తెలీదని అన్నాడు ప్రసాంత్. దీంతో రతిక ఇన్వాల్ అయ్యింది. అంత కుక్కలా తిరిగాను అన్నావ్ కదా,, మరి ఇప్పుడు ఛాన్స్ వస్తే ఏం పీకుతున్నావ్ హౌస్ లో అంటూ నిలదీసి అడిగింది. అంతేకాదు, అమ్మాయి చుట్టూ లవ్ స్టోరీ ట్రాక్ నడపడానికి వచ్చావా అంటూ రెచ్చిపోయింది. దీంతో హౌస్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఒకవైపు అమర్ దీప్, మరోవైపు సందీప్, ఇంకో వైపు గౌతమ్ ఇలా అందరూ పల్లవి ప్రశాంత్ చేస్తున్న పనిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు, రెండు ముఖాలతో గేమ్ ఆడద్దని వార్నింగ్ ఇచ్చారు.

కెమెరాల కోసం నటించద్దు అని క్లియర్ గా చెప్పారు. దీంతో మనోడికి సీన్ అర్ధమైంది. అమర్ దీప్ మాట్లాడేటపుడు నోరుజారి నీ సీరియల్ యాక్టింగ్స్ నా దగ్గర చూపించకు అనేసరికి మిగతా హౌస్ మేట్స్ కి కూడా ఈ మాట ట్రిగ్గర్ అయ్యింది. దీంతో అందరూ పల్లవి ప్రశాంత్ కి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు. ఈ దెబ్బకి శుభశ్రీ, శోభెశెట్టి, ఆఖరికి రితిక కూడా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి పారేసారు. దీంతో ఆ మాట కావాలని అనలేదని ప్రశాంత్ చాలాసేపు బాధపడ్డాడు. అంతేకాదు, అందరూ నామినేట్ చేసినందుకు అందరూ ఫేక్ అని చెప్తున్నందుకు వెక్కి వెక్కి ఏడ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం అంతా రతిక చుట్టూనే తిరిగిన ప్రశాంత్ ఇప్పుడు రతికే నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. శివాజీ ప్రశాంత్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే, సందీప్ కూడా ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా చాలా లాజిక్స్ వర్కౌట్ చేశారు మిగతా హౌస్ మేట్స్ అందరూ. అంతేకాదు, రతిక అయితే బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలకోసమే ట్రాక్ నడిపిస్తున్నాడని నాకు చెప్పాడని థామినితో చెప్పింది. దీంతో ప్రశాంత్ ఇప్పుడు నామినేషన్స్ నుంచీ ఎలా సేవ్ అవుతాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus