Rathinirvedam: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన సినిమా మళ్లీ వస్తోంది.. కుర్రాళ్లూ రెడీనా?

తెలుగు ప్రేక్షకులకు సినిమ అంటే పిచ్చి… అందుకే రీరిలీజ్‌ అవుతున్న సినిమాలను సైతం తెగ చూసేస్తున్నారు. దీని గురించి మనం ఇప్పటికే ఓసారి మాట్లాడుకున్నాం కూడా. అయితే ఈ క్రమంలో ఈ ట్రెండ్‌ను ఆసరాగా తీసుకొని చాలా చిన్న సినిమాలు, ఫ్లాప్‌ సినిమాలు, ఎందుకు తీశారో తెలియని సినిమాలు కూడా థియేటర్లలో మళ్లీ వచ్చేస్తున్నాయి. అంతేకాదు వాటిలో కొన్నింటిని మన సినిమా జనాలు చూసేస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఓ హాట్‌ మూవీని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

రీరిలీజ్‌ల ట్రెండ్‌ తొలుత ఆ హీరోల పుట్టిన రోజులు లేదంటే ఏదైనా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు చేసేవారు. ఇప్పుడు అయితే టైమ్‌ రైమ్‌ లేకుండా గుర్తొచ్చినప్పుడు రిలీజ్‌లు అయిపోతున్నాయి. దీంతో చిన్న సినిమాలకు ఇబ్బంది అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలకు ఈ లెక్కల ఏవీ వర్తించవు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సినిమా గురించి ఓపెన్‌గా మాట్లాడకపోయినా… తెగ డిస్కషన్‌ చేశారు కుర్రాళ్లు.

ఆ సినిమానే (Rathinirvedam) ‘రతి నిర్వేదం’. శ్వేతా మీనన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన బోల్డ్‌ మూవీ ఇది. ఈ సినిమాలో చర్చించిన అంశాలు అప్పట్లో హాట్‌ టాపిక్‌. ఇప్పుడు అదే సినిమాను మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట. మలయాళం నుండి సెమీ పోర్న్‌ / సాఫ్ట్‌ పోర్న్‌ సినిమాల సందడి ఎక్కువగా ఉన్న సమయంలో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో భారీ విజయం కూడా అందుకుంది. న‌డి వ‌య‌స్కురాలితో ప్రేమ‌లో ప‌డి ఆమెతో శృంగార సంబంధం పెట్టుకునే ఓ యువకుడి కథ ఇది.

ఇందులో శ్వేతా మీన‌న్ తన నటన, అందచందాలతో అదరగొట్టేసింది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఇంటర్నెట్‌ లేదు కాబట్టి ఆ సినిమాను అలా చూశారామో… ఇప్పుడు అందుబాటులో అన్నీ ఉండగా… ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు ఎవరు అనే ప్రశ్న వస్తోంది. చూద్దాం మన ప్రేక్షకులు ఆ సినిమాను కూడా ఆదరిస్తారేమో.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus