డిఫరెంట్ డైరెక్టర్ రవిబాబు..!!

  • July 11, 2016 / 05:53 AM IST

సాధారణంగా సినిమా అంటే బిగ్ స్టార్లు.. భారీ బడ్జెక్టులు.. ఆడియో వేడుకలు.. ప్రెస్ మీట్లు.. విజయోత్సవ ర్యాలీలు .. ఉంటాయి. ఇవేమి లేకుండా అతని పేరుతోనే థియేటర్లోకి ప్రేక్షకులను రప్పించగల శక్తి రవిబాబుకి మాత్రమే ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ.. వినూత్నంగా ప్రచారం చేస్తూ డిఫరెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. తన తండ్రి చలపతిరావుకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పరిచయాలను ఏ మాత్రం వినియోగించుకోకుండా పూర్తిగా తన ప్రతిభతో ఎదిగిన దర్శకుడు రవిబాబు. అంతేకాదు విలక్షణమైన పాత్రలను చేస్తూ నటనలోనూ పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పంది పిల్లతో సినిమా చేస్తానంటూ ప్రకటించి మీడియా, సినీ వర్గాలు ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఈ సందర్బంగా ఆయన చిత్రాలపై ఫోకస్.

అల్లరిరవిబాబు తొలి చిత్రం అల్లరి. హీరో మెటీరియల్ కానని బాధపడుతున్ననరేష్ ని ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం చేశారు. 45 రోజుల్లో 85 లక్షలతో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. నరేష్ చేసిన అల్లరి యువతకు తెగ నచ్చేసింది. రూ.5 కోట్ల వసూల్ రాబట్టింది. రవిబాబు ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం పేరు నరేష్ ఇంటి పేరుగా మారిపోయింది.

అమ్మాయిలు అబ్బాయిలుఅడల్ట్ కామెడీతో రవిబాబు తెరకెక్కించిన చిత్రం అమ్మాయిలు అబ్బాయిలు. ఈ చిత్రంలోని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. “సుబ్బారావు సుబ్బారావు స్నానం గాని చేసావా” అనే పాట అందరి నోళ్ళలో నానింది. దీన్నితొలిచిత్రం కంటే మరింత తక్కువ బడ్జెక్టు తో నిర్మించి లాభాలను రప్పించడంలో రవిబాబు విజయం సాధించారు.

సోగ్గాడుహీరోగా పేరుతెచ్చుకున్న నటుడిని పెట్టుకుని రవిబాబు తీసిన తొలిచిత్రం సోగ్గాడు. ఆర్తి అగర్వాల్ కి కూడా అప్పుడు లీడింగ్లో ఉంది. వారితో ఒక ప్రేమ కథను డిఫరెంట్ గా తీసి సక్సస్ అయ్యారు. పాటలను వినూత్నంగా చిత్రించగలరు అనే పేరు మూడో చిత్రంతోనే రవిబాబు సొంతం చేసుకున్నారు.

పార్టీడిఫరెంట్ థీమ్ తో రవిబాబు రూపొందించిన చిత్రం పార్టీ. ఇందులో అల్లరి నరేష్, శశాంక్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలో కామెడీ చాలా బాగున్నా .. బాక్స్ ఆఫీస్ వద్ద విజయం అందుకోలేక పోయింది.

అనసూయరవిబాబు థ్రిల్లర్ జాన్రాలో తీసిన చిత్రం అనసూయ. భూమిక టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో నిర్మాతగానూ రవిబాబు విజయం సాధించారు. ఈ మూవీని కన్నడ, మలయాళం లో రీ మేక్ చేశారు.

నచ్చావులేసినిమా ప్రచార చిత్రాల్లో హీరోలే ఉండాలి, సినిమాలోని సన్ని వేశాల చిత్రాలే ఉండాలి అనే రూల్ ని నచ్చావులే సినిమాతో రవిబాబు బ్రేక్ చేశారు. సంగీతం వింటున్న కోతుల చిత్రాలతో యాడ్స్ డిజన్ చేసి .. ఆడియోని సూపర్ హిట్ చేయించారు. తనీష్, మాధవీ లతను హీరో, హీరోయిన్ల గా పరిచయం చేస్తూ రొమాంటిక్ లవ్ స్టోరీ ని మరింత అందంగా తెరపై చూపించారు. ఈ చిత్రానికి అయిన వ్యయానికి మూడు రెట్ల ఆదాయం వచ్చింది. అంతేకాదు మూడు నంది అవార్డులను కూడా నచ్చావులే సొంతం చేసుకుంది.

అమరావతిఅనసూయ తరహాలో మరోసారి అమరావతి సినిమాతో రవిబాబు థ్రిల్ కి గురి చేశారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో, హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో హిట్ కొట్టారు. ఇందులో విలన్ పాత్ర చేసిన హీరో తారక రత్న నంది అవార్డు కైవశం చేసుకున్నారు.

మనసారావిక్రమ్, శ్రీ దివ్య లను పరిచయం చేస్తూ కేరళ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించిన చిత్రం మనసారా. అక్కడి కలరి ఫైట్ ను ఇందులో బాగా చూపించారు. కేరళలోని విర్జిన్ అడవిలో తీసిన ఈ చిత్రం కొత్త ఫ్లేవర్ తో అలరించింది. ఈ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది.

నువ్విలాతన ప్రతి చిత్రంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే రవిబాబు ఈ సారి ఆరుమందిని నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయించారు. ఇది రొమాంటిక్ కామెడీ చిత్రంగా విజయం సాధించింది.

అవును
ఏనుగు కాళ్ల మధ్యన నలిగి పోతున్న ఓ అమ్మాయి పోస్టర్ ని రిలీజ్ చేసి రవిబాబు క్రియేటివ్ డైరెక్టర్ గా అందరితో “అవును” అని అనిపించుకున్నారు. తక్కువ బడ్జెక్ట్ , కొత్త టెక్నీక్ తో దెయ్యం సీనియాను తీసి భయపెట్టించారు. హర్ష వర్ధన్, పూర్ణల నటన ఇందులో హైలెట్ గా నిలిచింది.

లడ్డుబాబుసన్నని నరేష్ ని లడ్డుబాబు లా చేసాడు. హాలీవుడ్ టెక్నీషియన్ల ద్వారా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించక పోయినా.. డైరక్టర్ గా రవిబాబుకి, నటుడిగా నరేష్ మంచి పేరు తెచ్చిపెట్టింది.

అవును 2అవును చిత్రానికి సీక్వెల్ గావచ్చిన అవును 2 తెలుగు ప్రేక్షకులను మరింతగా నచ్చింది. హర్ష వర్ధన్, పూర్ణ, రవిబాబు పాత్రల నడుమ సాగే సన్నివేశాలు థ్రిల్ కి గురిచేశాయి. రవి బాబు, సురేష్ బాబు నిర్మించిన ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది.

నటుడిగా నవ్విస్తూ.. డైరక్టర్ గా మెప్పిస్తూ .. నిర్మాతగా విభిన్న చిత్రాలను చేస్తూ రవిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానంలో నిలబడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus