గుండెపోటుతో మరణించిన రవి కిషన్ సోదరుడు..

సినీ పరిశ్రమలో గతకొద్ది రోజులుగా జరుగుతున్న ఊహించని సంఘటనలతో తీవ్ర అలజడి నెలకొంది. వరుసగా చిత్ర ప్రముఖులు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. జమున, కె.విశ్వనాథ్, ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం వంటి లెజండరీ పర్సనాలిటీస్‌ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. అలాగే తమిళ ఇండస్ట్రీలో నటుడు తంగరాజ్, యాక్టర్ కమ్ డైరెక్టర్ టీపీ గజేంద్రన్ వంటి వారు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.. ఈ వార్తలు ఇంకా వైరల్ అవుతుండగానే..

మరో నటుడి ఇంట తీవ్ర విషాదం నెలకొందనే దుర్వార్త తెలిసింది. ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ (గోరఖ్ పూర్) రవి కిషన్ అన్నయ్య రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆదివారం (ఫిబ్రవరి 5) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్నయ్య కన్నుమూశారని రవి కిషన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అన్న మరణంతో రవి కిషన్ ముంబై బయలుదేరి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామ్ కిషన్ శుక్లా మృతికి సంతాపం తెలియజేస్తూ..

సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులర్పిస్తున్నారు. బాలీవుడ్ వర్గాల వారి సమాచారం ప్రకారం.. రామ్ కిషన్ శుక్లా.. బాంబేలో ఉంటూ రవి కిషన్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటుండేవారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషయమించడంతో నానావతి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామ్ కిషన్ మరణించినట్లు ధృవీకరించారు. ఆయన భార్య ఇప్పటికే మృతి చెందగా.. ఓ కొడుకున్నాడు.

ఇక రవి కిషన్ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. 1992లో హిందీలో ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus