Ravi Teja, Balakrishna: ‘అన్‌స్టాపబుల్‌’తో మరో విషయంపై క్లారిటీ!

టాలీవుడ్‌లో అగ్ర హీరోల మధ్య గొడవలు జరిగాయని… వార్తలు వింటూనే ఉంటాం. అలాంటి గొడవల్లో చాలా ఏళ్లుగా వింటున్న విషయం బాలకృష్ణ – రవితేజ మధ్య పెద్ద గొడవ అని. దీనిపై ఇన్నాళ్లూ క్లారిటీ వచ్చే అవకాశం రాలేదు. అయితే బాలయ్య ఇటీవల ‘అన్‌స్టాపబుల్‌’ అంటూ ఓ షోను స్టార్ట్‌ చేశారు. వరుసగా స్టార్‌ గెస్ట్‌లను పిలుస్తూ… కీలక విషయాలను బయటకు తీసకొస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన క్లారిటీలు కూడా బయటకు వస్తున్నాయి.

డిసెంబరు 31న ‘అన్‌స్టాపబుల్‌’లో మాస్‌ మహారాజ్‌ రవితేజ, యువ దర్శకుడు గోపీచంద్‌ మలినేని సందడి చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. అందులో చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బాలయ్య అడిగిన తొలి ప్రశ్న ‘మీకు నాకూ పెద్ద గొడవ అయ్యింది అని అంటున్నారు. ఏమంటావ్‌’ అని అడిగేశారు. దానికి రవితేజ చెప్పిన సమాధానం హైలైట్‌. ‘ఎవరో పనీపాట లేని డ్యాష్ నా డ్యాష్ గాళ్లు’ చేసిన పని ఇది అంటూ రవితేజ… బాలయ్యను ఓ హగ్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత ఇక సందడే సందడి. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ఇద్దరూ కుర్రాళ్లు అయిపోయారు. మొగల్రాజపురంలో రవితేజ అమ్మాయిలను లైనేసే విషయాలు కూడా చర్చించుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ కేసు గురించి చర్చ వచ్చింది. దానికి రవితేజ రియాక్ట్‌ అవుతూ… ఎందుకు చేశారో కానీ… పెంట పెంట చేసేశారు అని అన్నారు. ఇక రవితేజ తనయుడు మహాధన్‌ గురించి కూడా చర్చ వచ్చింది. దానికి రవితేజ తన కొడుకును డీఎన్‌కే అని పిలుచుకుంటానని చెప్పుకొచ్చాడు.

దీంతోపాటు మరికొన్ని విషయాలను కూడా ఈ సందర్భంగా డిస్కస్‌ చేసుకున్నారు. ఇక దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా తన విషయాలు చెప్పుకొచ్చారు. ‘సమర సింహారెడ్డి’ సినిమా సమయంలో అరెస్టు అయ్యానని, పోలీసులు లోపల ఓ కోటింగ్‌ కూడా వేశారని కూడా చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం డిసెంబరు 31న సాయంత్రం స్ట్రీమ్‌ చేస్తున్నారు. ఆ రోజు మనకు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్‌ అండ్‌ సీ అండ్‌ ఎంజాయ్‌.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus