‘మహాసముద్రం’ కోసం మనసు మార్చుకున్న రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వీఐ.ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కోరాజా’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం చేస్తుండగానే మరో రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.అందులో ఒకటి… తనకి ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా కాగా.. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తో మరొకటి. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే మొదలవ్వాల్సి ఉంది కానీ మొదలవ్వలేదు. దీనికి ముఖ్య కారణం రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ తగ్గకపోవడమే కారణమని టాక్.

రవితేజ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేనని నిర్మాత చెప్పాడట. అయితే ‘మహా సముద్రం’ కథ తనకి బాగా నచ్చడంతో… ఈ ప్రాజెక్ట్ ను వదులుకోవడం ఇష్టం లేక… లాభాల్లో వాటా ఇస్తే చేస్తానంటూ రవితేజ నిర్మాత చెప్పాడట. దీనికి నిర్మాత ఓకే చెప్పడంతో…. ఈ చిత్రం త్వరలోనే మొదలుకాబోతుందని సమాచారం. ఈ చిత్రంలో సిద్ధార్థ్ కూడా ఓ హీరోగా నటించబోతున్నాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus