కరోనా సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ఎఫెక్ట్ చూపించిందో తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో.. నిర్మాతలు అప్పు తెచ్చిన డబ్బుకి వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బంది పడ్డారు. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాల్లో బేరాలు ఆడుతూ కొంతైనా ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హీరోలు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ హెడ్ దిల్ రాజు కూడా ఈ విషయంలో హీరోలని ఒప్పించలేక తను నిర్మిస్తోన్న ‘ఎఫ్ 3’ సినిమాలో హీరోకి భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మాస్ హీరో రవితేజ కూడా రేటు పెంచేశారని సమాచారం. సింగిల్ పేమెంట్ తీసుకొని రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న ‘క్రాక్’ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో తరువాత తనతో ఎవరైనా సినిమా చేయాలంటే రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని రవితేజ కోరుతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. ఈ పాయింట్ కూడా రవితేజకి కలిసొస్తుంది.
మాస్ హీరోతో సినిమా అంటే కాస్త కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆయన డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ విన్న నిర్మాతలకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. పోనీ ‘క్రాక్’ సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూద్దామా..? అంటే ఆ సినిమా గనుక హిట్ అయితే రూ.12 కోట్ల కాస్త 13, 14 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో రవితేజతో సినిమా చేయాలనుకుంటున్న వారు కిందా మీదా అవుతున్నారట.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!