Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ఇంటర్వ్యూ : ‘ధమాకా’ గురించి రవితేజ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

ఇంటర్వ్యూ : ‘ధమాకా’ గురించి రవితేజ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • December 23, 2022 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్వ్యూ : ‘ధమాకా’ గురించి రవితేజ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

మాస్ మహారాజ్ రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా రవితేజ పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీ కోసం :

ప్ర.’ధమాకా’ విషయంలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు? ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు?

రవితేజ : ప్రేక్షకులు సినిమాని చూసే తీరు మారింది. కాబట్టి.. ఆ కోణంలో ఆలోచించి ప్రమోషన్స్ విషయంలో ఒకడుగు ముందుకు వేశాను.

ప్ర.గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్ మీట్ కూడా జరిగింది కదా ?

రవితేజ : ఫ్యాన్స్ తో కలవడం జరుగుతూనే ఉంటుంది. ఫ్యాన్ మీట్ ని చాలా ఎంజాయ్ చేశాను. అన్ని చోట్ల పాజిటివ్ గా ఉంది. ఆ పాజిటివిటీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.

ప్ర.గతంలో ప్రమోషన్లకు వచ్చినప్పుడు సినిమా గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు.. హైప్ కూడా ఇచ్చేవారు కాదు కదా ?

రవితేజ : మొదటి నుండి నేను నేనింతే. మనం మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా సినిమానే మాట్లాడుతుంది కదా.!

ప్ర. ధమాకా ఎలా ఉండబోతుంది?

రవితేజ : ‘ధమాకా’ మంచి ఎంటర్టైనర్. రాజా ది గ్రేట్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయలేదు. ‘ధమాకా’ ఫుల్ ఎంటర్ టైనర్. జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు.

ప్ర : ఈ మధ్య సీరియస్ సినిమాలు చేశారు ? అందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ?

రవితేజ : అన్నీ ప్రయత్నించాలి కదా. ఫలితం మాట పక్కన పెడితే ప్రయత్నం జరుగుతూనే వుండాలి.

ప్ర.’ధమాకా’ ని రౌడీ అల్లుడు తో పోలుస్తున్నారు ?

రవితేజ : మా రచయిత ఈ మాట చెప్పి ఉంటారు. తెలుగు లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి గారు. తర్వాత మేమంతా ఫాలో అయ్యాం. ధమాకా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు.

ప్ర.కొత్త రచయితలతో ఈ మధ్య ఎక్కువగా పని చేస్తున్నారు కదా ?

రవితేజ : ఈ మధ్య కాదు. మొదటి నుండీ అంతే..!నాకు కొత్త రచయితలతో పని చేయడం ఇష్టం. వాళ్ళలో ఒక ఆకలి, తపన ఉంటుంది. నేను అలా వచ్చినవాడినే కదా.!

ప్ర. భీమ్స్ కి కూడా మీ ఎనర్జీ అలవాటు అయినట్టు ఉంది?

రవితేజ : రెచ్చిపోతున్నాడు కాదా.!(నవ్వుతూ) ధమాకా ఆల్బమ్ ఇరగదీశాడు. మంచి ట్యూన్ మేకర్ అతను. ‘ధమాకా’ సౌండ్ అదిరిపోయింది. అన్ని పాటలు బాగా చేశాడు.

ప్ర. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి చెప్పండి?

రవితేజ : త్రినాథరావు నక్కినతో చాలా సరదా సరదాగా ఉంటుంది. తనతో పని చేయడం అందరికీ కంఫర్ట్ బుల్ గా ఉంటుంది.

ప్ర.త్రినాథ‌రావు మీ ఫ్యాన్ అని చెప్పారు..? ఫ్యాన్ డైరెక్టర్ తో పనిచేసే సౌల‌భ్యం వేరుగా ఉంటుందా?

రవితేజ : అలాగేం లేదు. తన హీరో ఇలా ఉండాలి, ఇలా చూపించాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది.

ప్ర.రైటర్ ప్రసన్న తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

రవితేజ : ప్రసన్న అద్భుతంగా రాశాడు. ఈ సినిమా లో డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రసన్న, త్రినాధరావు కాంబో చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. వాళ్ళ కాంబినేషన్ లో అన్నీ వర్క్ అవుట్ అయ్యాయి. ఇది అలానే ఉంటుంది.

ప్ర. హీరోయిన్ శ్రీలీల పెద్ద స్టార్ అవుతుందని చెప్పారు?

రవితేజ : ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతుంది. అందం, ప్రతిభ రెండూ ఉన్నాయి. మంచి డ్యాన్సర్, వాయిస్, ఎనర్జీ అన్నీ ఉన్నాయి తనలో.! పైగా తెలుగమ్మాయి. తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది.

ప్ర. కథల ఎంపిక విషయంలో మీ జడ్జ్ మెంట్ ఎలా ఉంటుంది. ?

రవితేజ : కథ నచ్చితే ఓకే చేస్తాను. ఇంకాస్త పక్కాగా రెడీ చేసుకుని రమ్మంటాను. ముందు కథ నచ్చాలి. కథ నచ్చకుండా కాంబినేషన్ నమ్మి చేయను. నేనే కాదు ఎవరూ కథ నచ్చకుండా చేయరు.

ప్ర. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో మళ్ళీ మళ్ళీ పని చేస్తాను అని చెప్పారు ?

రవితేజ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు నిజంగా ఓ అద్భుతం. నాకు చాలా నచ్చారు. వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం. చాలా పాజిటివ్ గా ఉంటారు. అలాంటి వారికి విజయాలు వస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. అలాంటి వారికి హిట్లు రావాలి. వారితో ఎన్నిసార్లయినా పని చేస్తాను.

ప్ర. ఓటీటీ మీ ఆలోచన ధోరణిని మార్చింది అనుకోవచ్చా ?

రవితేజ : లేదు. ఓటీటీ వేరు, థియేటర్ వేరు. ఓటీటీ కి నేను ప్రభావితం కాను.

ప్ర. సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు? ఇంకా కథలు వింటున్నారా ?

రవితేజ : తప్పకుండా వింటాను.వింటూనే ఉంటాను. నిర్మాతకు కథ తెలియాలి. పెట్టుబడి పెడుతున్నాం. గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నీ తెలుసుకుంటాం. మా బ్యానర్ లో వచ్చే సినిమాలు గురించి త్వరలో చెబుతా..!

ప్ర. మీ అబ్బాయిని హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తారు?

రవితేజ : అందుకు చాలా టైమ్ వుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచనే లేదు. చదువుకుంటున్నాడు.

ప్ర. ‘వాల్తేరు వీరయ్య’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

రవితేజ : అందులో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. పండక్కి మీరు చూసి చెప్పండి. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్యతో సినిమా చేయడం గొప్ప అనుభవం. కథ, క్యారెక్టర్ అద్భుతంగా కుదిరాయి. పైగా బాబీ దర్శకుడు.ఇంకేం కావాలి..!

ప్ర. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు? దాని గురించి?

రవితేజ : నేను చేస్తే సరిపోదు. కథలో పాన్ ఇండియా కంటెంట్ ఉండాలి. ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వర రావు’ పాన్ ఇండియా మూవీ . అది చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Jayaram
  • #Ravi teja
  • #Sreeleela
  • #Thrinadha Rao Nakkina

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

10 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

11 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

11 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

6 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

7 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

10 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

12 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version