Ravi Teja: ఎన్నాళ్లీ ఎదురు చూపులు.. ఎమోషనల్ అవుతున్న రవితేజ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?

మాస్ మహారాజా రవితేజ.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. రవితేజ కామెడీకి కేరాఫ్ అడ్రెస్.. తన సినిమా అంటే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చక్కగా నవ్వుకోవచ్చు.. మినిమం గ్యారెంటీ.. పక్కా పైసా వసూల్.. అనుకుని థియేటర్లకొచ్చేవారు ఫ్యాన్స్, ఆడియన్స్.. అలాగే మంచి ఎంటర్‌టైనర్స్‌తో.. తనకు మాత్రమే సాధ్యమయ్యే సాలిడ్ కామెడీ టైమింగ్‌తో అదర గొట్టేశాడు. కట్ చేస్తే.. కొంత కాలంగా ఆయన చేస్తున్న చిత్రాలు చూసి అభిమానులు కూడా.. ఇలాంటివి చేస్తున్నాడేంటి అని షాక్ అవుతున్నారు.

ఇండస్ట్రీలోనూ అందరితో ఫ్రెండ్లీగా ఉండే రవితేజను అందరి హీరోల అభిమానులూ ఆదరిస్తారు. వాళ్లు కూడా ఇప్పుడొస్తున్న వాటిలో మాస్ మహారాజా మార్క్ మిస్ అవుతుంది అంటున్నారు. కామెడీ, మాస్, యాక్షన్.. ఏదైనా ఈజీగా చేసి మెప్పించగల రవితేజ కథల ఎంపికలో కొంచెం కేర్ తీసుకోవాలంటున్నారు. ‘రాజా ది గ్రేట్’ ఛాలెంజింగ్ బ్లైండ్ క్యారెక్టర్లో అలరించాడంటే అది తన ఇమేజ్ వల్లే.. తర్వాత ‘టచ్ చేసి చూడు’, ‘నేలటికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘డిస్కోరాజా’ లాంటి వరుస ఫ్లాపులు..

‘క్రాక్’ తో ట్రాక్‌లోకి వచ్చాడనుకుంటే.. ‘కిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో మళ్లీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వర రావు’ తో పాటు.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. సినిమా మొత్తం దాదాపు 45 నిమిషాల పాటు రవితేజ క్యారెక్టర్ ఉంటుందని, చిరుతో కలిసి తన మార్క్ కామెడీతో ఇరగదీసేస్తాడని అంటున్నారు. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్ పక్కన నటిస్తున్నాడు రవి.. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఏమంటున్నారంటే.. ‘‘నీ నుండి ‘ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, దుబాయ్ శీను, కిక్’ లాంటి ఎంటర్‌‌టైనర్స్ మిస్ అవుతున్నాం.. ప్లీజ్, అలాంటి అదిరిపోయే కామెడీ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకో.. నిన్ను మళ్లీ అలాంటి అల్టిమేట్ మూవీస్‌లో చూడాలనుకుంటున్నాం.. మిస్ యూ మాస్ మహారాజా రవితేజ’’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus