Ravi Teja, Amardeep: రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమర్?

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ ఒకరు. ఈయన హౌస్ లో ఉన్నన్ని రోజులు ఏ విధమైనటువంటి మాస్క్ లేకుండా తన అభిప్రాయాన్ని తన కోపాన్ని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చాలా జెన్యూన్ గా గేమ్ ఆడారు. ఇలా తప్పులను చేసినప్పుడు తన తప్పులను తెలియజేస్తూ మరోసారి అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతూ టాప్ వరకు కొనసాగారు. ఇక విన్నర్ అమర్ దీప్ అని ఓ అంచనాకి కూడా అభిమానులు వచ్చారు కానీ 14వ వారంలో ప్రశాంత్ తో జరిగిన గొడవ కారణంగా ఈయనకు కాస్త నెగెటివిటీ ఏర్పడిందని చెప్పాలి.

మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమంలో అమర్ రన్నర్ గా నిలిచారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈయన ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. అమర్ రవితేజకు బిగ్ ఫ్యాన్ అనే విషయం మనకు తెలిసిందే. ఫినాలేలో భాగంగా రవితేజ స్టేజ్ పైకి రావడంతో గేట్స్ ఓపెన్ అవుతున్నాయి నువ్వు బయటకు వస్తే రవితేజ సినిమాలో నటించవచ్చు అంటూ నాగార్జున చెప్పడంతో అమర్ ఏమాత్రం ఆలోచించకుండా బయటకు రావడానికి కూడా సిద్ధం అయ్యారు.

ఇలా తనని అమర్ అభిమానిస్తున్నటువంటి తీరకు రవితేజ కూడా షాక్ అయి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని తెలియజేశారు. అయితే నిజంగానే అమర్ రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది. రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అంటే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనుకుంటే మాత్రం పొరపాటే రవితేజ ఇప్పటికే నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

దీంతో అమర్ ను హీరోగా తన బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి (Ravi Teja) రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా కోటి రూపాయల చెక్క అమర్ ఇంటికి కూడా పంపించారని తెలుస్తుంది. ఏది ఏమైనా అమర్ బిగ్ బాస్ ద్వారా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus