Ravi Teja: మాస్ మహారాజ కోసం మాస్ టైటిల్!

వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ రవితేజకి ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని తీసుకొచ్చింది. ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను పట్టాలెక్కిస్తూ బిజీ అయిపోయాడు రవితేజ. ‘ఖిలాడి’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే షూటింగ్ లో పాల్గొంటున్నాడు మాస్ మహారాజ. అలానే త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో కొత్త సినిమాను మొదలుపెట్టాడు. దసరా సందర్భంగా ఈ సినిమాకి ‘ధమాకా’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రవితేజ్ లుక్ ఆకట్టుకుంటోంది. స్టైల్ గా కనిపిస్తూ జేబులో చేతులు పెట్టుకొని.. కళ్లజోడు, నోట్లో సిగరెట్ తో సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు రవితేజ. సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్ లైన్ ఇవ్వడంతో సినిమాలో రవితేజ క్యారెక్టర్ కి డబుల్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటీకే ‘ఖిలాడి’ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు రవితేజ.

ఇప్పుడేమో డబుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. మొత్తానికి సినిమా సినిమాకి తన పాత్రల్లో వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus