రవితేజ (Ravi Teja) – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో ‘షాక్’ (Shock) ‘మిరపకాయ్'(Mirapakay) వంటి చిత్రాల తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల అంటే ఇండిపెండెన్స్ డే కానుకగా ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ అయ్యింది. సినిమాకి మౌత్ టాక్ బాగానే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ఇన్కమ్ టాక్స్ రైడ్ ఎపిసోడ్స్ … మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా బి,సి సెంటర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ‘మిస్టర్ బచ్చన్’ లో జగపతి బాబు (Jagapathi Babu) విలన్ గా చేశారు.
గతంలో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘సముద్రం’ ‘బడ్జెట్ పద్మనాభం’ వంటి సినిమాల్లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ సినిమాల్లో(నేల టిక్కెట్టు లో కూడా) జగపతి బాబు విలన్ గా చేశాడు. ‘ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి’ అంటూ ఈ సినిమాలో జగపతి బాబుతో ఓ పాట కూడా పాడించాడు దర్శకుడు హరీష్ శంకర్. బహుశా.. వీరి ప్రయాణాన్ని గుర్తుచేస్తూనే ఆ పాటని చమత్కారంగా జోడించినట్టు ఉన్నాడు.
ఇదిలా ఉండగా..రవితేజ రైడ్ చేసిన ఇంటికి యజమానురాలిగా అంటే.. జగపతి బాబుకి భార్య ప్రభావతి పాత్రలో ఇందులో మణిచందన (Manichandana) నటించింది. గతంలో ‘రవితేజకి మణిచందన (Manichandana) హీరోయిన్ గా నటించింది’ అని ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ ఇది నిజం. 2000 సంవత్సరంలో రవితేజ హీరోగా ‘మనసిచ్చాను’ (Manasichanu) అనే సినిమా వచ్చింది. ప్రమోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో రవితేజ, మణిచందన..ల లవ్ ట్రాక్ బాగుంటుంది.
ఇంకో విశేషం ఏంటంటే.. మణిచందన హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం. ఆ తర్వాత కూడా ఈమె ‘ఎన్టీఆర్ నగర్’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. అక్కడి జనాలు ఈమెను జూనియర్ ఖుష్బూ అంటుంటారు. ప్రస్తుతం మణిచందన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.