మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు వరుస ప్లాప్ లతో డీలా పడ్డ రవితేజకి ఈ సినిమా బూస్టప్ ఇచ్చింది. దీంతో ఈ హీరో తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతడు డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘క్రాక్’ తో పాటు తను అంగీకరించిన సినిమాలకు రూ.10 నుండి రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ..
ఇప్పుడు ‘క్రాక్’ సక్సెస్ తో తన రేటుని రూ.16 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. రవితేజతో కలిసి సినిమా చేయాలనుకుంటున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. కానీ అనుకున్న బడ్జెట్ లో ఎక్కవ శాతం హీరో రెమ్యునరేషన్ కే వెళ్లిపోతుండడంతో.. సినిమాను పూర్తి చేయడానికి కష్టమవుతుందని భావిస్తున్నారు. ఇదే విషయం గురించి రవితేజతో మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ హీరో రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారు.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలానే రవితేజ తన తదుపరి సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. కానీ నిర్మాతలకు అతడి రెమ్యునరేషన్ మాత్రం సమస్యగా మారినట్లు తెలుస్తోంది.