శ్రీనువైట్ల కోసం సంతోష్ శ్రీనివాస్ ను పక్కన పెట్టిన రవితేజ

“నేల టికెట్టు” షూటింగ్ పూర్తవ్వడానికి ముందే తమిళ సూపర్ హిట్ చిత్రం “తేరి” రీమేక్ లో నటించడానికి ఒప్పుకొన్న రవితేజ.. “నెలటికెట్టు” చిత్రానికి గుమ్మడికాయ కొట్టిన రోజే “తెరీ” చిత్రం రీమేక్ కు కొబ్బరి కాయ కొట్టి రైన్ ఫైట్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలెట్టడం విశేషం. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమా కూడా ఒప్పుకొన్నాడు రవితేజ. “అమర్ అక్బర్ ఆంటోనీ”తోపాటు తెరీ రీమేక్ ను కూడా ఒకేసారి కంప్లీట్ చేయాలనుకొన్నారు. అయితే.. శ్రీనువైట్ల సినిమాలో దిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేయాల్సి రావడం.. లాస్ట్ మినిట్ లో హీరోయిన్ గా అనుపమ తప్పుకోవడం ఆమె స్థానంలో ఇలియానా రావడంతో ప్రొజెక్ట్ కాస్త డిలే అయ్యింది.

ఆ డిలే మొత్తాన్ని ఇప్పుడు కవర్ చేసి సినిమాని అర్జెంట్ గా ఫినిష్ చేయాల్సి రావడంతో.. ముందు అనుకొన్నట్లుగా రెండు సినిమాలు ఒకేసారి కాకుండా ముందు “అమర్ అక్బర్ ఆంటోనీ” పూర్తి చేసి ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యాడట రవితేజ. సంతోష్ శ్రీనివాస్ తోపాటు ఈ రెండు చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇదే డెసిషన్ ను ఫైనల్ చేయడంతో రవితేజ కాస్త ఫ్రీ అయ్యాడు. ఈ రెండు సినిమాల అనంతరం రవితేజ ఓ మల్టీస్టారర్ సినిమా ఒకే చేశాడని వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus