ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు!

బెంగాల్ టైగ‌ర్ త‌ర‌వాత ర‌వితేజ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. వేణు శ్రీరామ్ తో దిల్ రాజు బ్యానర్ అనుకున్న సినిమా మధ్యలోనే ఆగిపోయింది. చ‌క్రి అనే కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌కు ఓకే చెప్పినా.. దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే సాహ‌సం చేయ‌లేక‌పోయాడు ర‌వితేజ‌. ఇప్పుడు బాబి క‌థ‌కు ఓకే చెప్పేసిన‌ట్టు టాక్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు ప‌వ‌ర్‌సినిమా వ‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండో సినిమా రాబోతోంద‌న్న‌మాట‌. మ‌రోవైపు బాబి.. స‌ర్దార్ ఫ్లాప్‌తో చ‌ప్పున చ‌తికిల‌ప‌డ్డాడు. ముగ్గురు హీరోల దగ్గరకు వెళ్ళి బాబీ కథలు చెప్పినా ఎవరు బాబీతో సినిమా చేయడానికి సిద్ధంగా లేరు. బాబి స‌త్తా తెలిసిన ర‌వితేజ‌.. బాబిని పిలిచి క‌థ చెప్ప‌మ‌న్నాడ‌ట‌. బాబి క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు టాక్‌. ఈ సినిమాకి ‘రా’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. డివివి దాన‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. దీని గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus