Chiranjeevi, Ravi Teja: చిరు సినిమాలో ఎలాంటి మార్పులు లేవట!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మెగాస్టార్ తదుపరి సినిమాల గురించి రకరకాల గాసిప్స్ వినిపించడం మొదలయ్యాయి. దర్శకుడు బాబీ రూపొందిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. దీనికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ.. చిరంజీవి ‘ఆచార్య’ ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సినిమా నుంచి తప్పుకున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలవుతుందని, అందులో రవితేజ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. సినిమాపై వస్తోన్న రూమర్లపై ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు.

ఈ సినిమా మీద దర్శకుడు బాబీ టీమ్ గట్టిగా పని చేస్తోంది. బాబీకి సన్నిహితులైన మరికొందరు రైటర్లు కూడా దాని మీద వర్క్ చేస్తున్నారు. కోనవెంకట్ కూడా వారిలో ఒకరు. ఈ సబ్జెక్ట్ మీద చిరంజీవి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇది రీమేక్ సబ్జెక్ట్ కూడా కాదని ఒరిజినల్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చిరంజీవి మాస్ గెటప్ లో కనిపించనున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus