Ravi Teja: రవితేజ కొత్త మూవీ కథ ఇదేనా?

రాజా ది గ్రేట్ మూవీ తర్వాత సక్సెస్ లేని రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కథ, కథనం అద్భుతంగా కుదరడంతో పాటు రవితేజ తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. తాజాగా రవితేజ కొత్త సినిమా పోస్టర్ రామారావ్ ఆన్ డ్యూటీ రిలీజైన సంగతి తెలిసిందే. శరత్ మాండవ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా పోస్టర్ ద్వారా రవితేజ కథకు సంబంధించి హింట్స్ ఇచ్చారు. మొదట రవితేజ ఈ సినిమాలో ఎమ్మార్వోగా కనిపిస్తారని వార్తలు వచ్చినా రవితేజ సబ్ రిజిస్ట్రార్ గా కనిపిస్తారని సమాచారం అందుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. గుప్త నిధులకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. రవితేజ రెండు షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం. ప్రభుత్వ సంపదను దోచుకోవడానికి ప్రయత్నించే వారికి రవితేజ తన పాత్రతో చుక్కలు చూపిస్తారని సమాచారం.

ప్రస్తుతం రవితేజ ఈ సినిమాతో పాటు ఖిలాడీ సినిమాలో నటిస్తుండగా ఖిలాడీ మూవీ త్వరలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. రవితేజ వరుసగా మాస్ సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. మరోవైపు రవితేజ క్రాక్ సక్సెస్ తర్వాత రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని తెలుస్తోంది. మాస్ మహరాజ్ గా పేరు సంపాదించుకున్న రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus