Chiranjeevi, Ravi Teja: మెగాస్టార్ సినిమాలో రవితేజ చేయబోయే క్యారెక్టర్ ఇదే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో స్టార్ హీరోలందరూ కూడా వారి స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టేసి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. మిగతా హీరోలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ముందుకు సాగుతూ అవసరమైతే వారి సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కూడా నటించేందుకు ఒప్పుకుంటున్నారు ఒక విధంగా చిత్ర పరిశ్రమలో ఇలాంటి సాన్నిహిత్యం మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే కొంతమంది హీరోలు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నారు.

Click Here To Watch Now

ఇక మరొకవైపు చిన్న పాత్ర అయినా సరే మరి కొందరు హీరోలు బేషరతు లేకుండా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాస్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో రవితేజ తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. సరిగ్గా 22 ఏళ్ల క్రితం వచ్చిన అన్నయ్య సినిమా లో కూడా మాస్ మహారాజా రవితేజ సోదరుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్ళి మెగాస్టార్ తమ్ముడిగా రవితేజ అలరించబోతున్నాడు. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకం కానుందని దాదాపు 40 నిమిషాల పాటు ఉండే ఆ పాత్ర మాస్ ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చుతుంది అని తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు వెంకీ కుడుముల అలాగే మరికొంత మంది యువ దర్శకులతో కూడా మెగాస్టార్ ప్రాజెక్టులను సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus