కెరీర్ ప్రారంభంలో క్లాప్ బాయ్ గా, లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు రవితేజ. సినిమాలో ఓ మూలాన రోల్ కోసం అతను ఎంతో తపించిపోయేవాడు. ‘నిప్పు రవ్వ’ సినిమాలో రాజా రవీంద్ర నటించిన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని చివరికి అది నాకు దొరకలేదని రవితేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే, తన సొంత ట్యాలెంట్ పై ఎదిగాడు. తన స్నేహితుడు పూరి రిఫరెన్స్ వల్ల స్టార్ హీరోగా కూడా ఎదిగాడు.
రవితేజ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కాకుండా తన తమ్ముళ్లు భరత్… రఘులను కూడా నటుల్ని చేశాడు. వాళ్ళు పెద్దగా రాణించలేదు కానీ అడపా దడపా సినిమాల్లో నటించారు. అయితే దురదృష్టవశాత్తు భరత్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఇక రఘు తనయుడు మాధవ్ కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. తన తండ్రితో కలిసి ఓ సినిమాలో కూడా నటించాడు. త్వరలో అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇతని వయసు 21 సంవత్సరాలు.
యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకొన్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మాధవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రవితేజ ఓ కథని ఓకే చేశారట. ఇది ఒక ప్రేమకథా చిత్రమని తెలుస్తుంది. మాధవ్ ఎంట్రీ బాధ్యత మొత్తం రవితేజనే తీసుకొన్నాడని తెలుస్తుంది. రవితేజకి 24 క్రాఫ్ట్స్ పై పట్టు ఉంది. అతను ఇండస్ట్రీకి ఎంతో మంది డైరెక్టర్లను పరిచయం చేశాడు.
అందులో చాలా మంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా రవితేజ వాళ్ళని విడిచిపెట్టడు.వాళ్ళతో గంటలు గంటలు డిస్కస్ చేసి వాళ్ళ టాలెంట్ ఏంటో కనిపెట్టి మరీ ఎంకరేజ్ చేస్తుంటాడు రవితేజ. మరి తమ్ముడి కొడుకుని వదులుతాడా?
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!