టాలీవుడ్లో బయోపిక్లో ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవల్లో వచ్చిన బయోపిక్లు.. టాలీవుడ్ వచ్చిన బయోపిక్లలో.. రాజకీయ నేతలు, క్రీడాకారులు.. శాస్త్రవేత్తలు.. సినీ తారల గురించినవి ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ దొంగ బయోపిక్ తెరకెక్కింది. ఓ దొంగ జీవితం ఆధారంగా ఇప్పటి వరకు సినిమాలు మాత్రమే వచ్చాయి.. కానీ బయోపిక్ రావడం ఇదే మొదటి సారి. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ కోవకు చెందినదే.
ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. అయితే మొదట ఈ సినిమా ఆఫర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వెళ్లిందట. కానీ ఎందుకో అక్కడ సెట్ కాక నెక్స్ట్ చిరంజీవిని ట్రై చేద్దామనుకున్నాడట డైరెక్టర్. అదీ కుదరక చివరకు మాస్ మహారాజ రవితే వద్దకు వచ్చిందట. మాస్ మహారాజ రవితేజ ఇప్పటి వరకు కేవలం టాలీవుడ్లోనే సినిమాలు చేశారు. రవితేజకు బాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక్కడి సినిమాలు హిందీలో డబ్ అయినవి చూసి అక్కడి ఫ్యాన్ రవితేజ యాటిట్యూడ్కి యాక్టింగ్కి ఫ్యాన్స్ అయిపోయారట. అయితే ఎట్టకేలకు ఈ మాస్ మహారాజ్ బాలీవుడ్ ఎంట్రీ.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. రెండూ ఈ సినిమాతో నెరవేరుతున్నాయన్నమాట. ఇక ఈ చిత్రం రవితేజకు మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ చిత్రం మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంటోంది. అదేంటంటే.. బధిరుల కోసం సంజ్ఞ భాష (సైన్ లాంగ్వేజ్)లోనూ ఈ సినిమాను (Tiger Nageswara Rao) విడుదల చేస్తున్నారట.
సైన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యే తొలి భారతీయ చిత్రమిదే. దాదాపు 20 ఏళ్ల తర్వాత నటి రేణూ దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను ఆమె పోషించారు. ఇక హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుక్రీతి వాస్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. టైగర్ నాగేశ్వరరావు అంటే అప్పట్లో టెర్రర్. పైకి భయంకరంగా కనిపించినా ఆయన మనసున్న మనిషి అని కొందరికే తెలుసు. ఆయనలో ఉన్న ఈ సాఫ్ట్ యాంగిల్ను ఈ సినిమాలో చూపించబోతున్నారని డైరెక్టర్ చెప్పారు.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!