మాస్ మహారాజ్ రవితేజకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా రవితేజ లెటెస్ట్ మూవీ ఈగల్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారని సమాచారం అందుతోంది. ట్రైలర్ లో యాక్షన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినా ఈ సినిమాలో రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రవితేజ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. గతంలో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ ఘట్టమనేని ఆ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు.
ఈగల్ (Eagle) సినిమాతో మాత్రం బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు. ఈగల్ రిలీజ్ డేట్ మారే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈగల్ సినిమా వాయిదా పడనుందని ఒక డిస్ట్రిబ్యూటర్ చేసిన ట్వీట్ వల్ల ఈ చర్చ మొదలైంది. రవితేజ ఈగల్ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పీపుల్స్ మీడియా బ్యానర్ కు ఈ సినిమాతో మరో భారీ హిట్ దక్కుతుందేమో చూడాలి. ఈ సినిమా ట్రైలర్ కు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.