2024 సంక్రాంతికి ఏకంగా ‘గుంటూరు కారం’ ‘హను – మాన్’ ‘ఈగల్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి 5 సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. వీటితో పాటు 2,3 డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నట్టు కూడా అధికారిక ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి సంక్రాంతికి ఇలా రిలీజ్ డేట్..లు అనౌన్స్ చేయడం, ఆ సినిమాలు వార్తల్లో నిలిచేలా చేసుకుని తర్వాత పోస్ట్ పోన్ చేయడం ఎప్పుడూ ఉండే వ్యవహారమే.
కాకపోతే ఈసారి ఎవరు ఈ రేస్ లో నుండి తప్పుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూని సాల్వ్ చేశాయి. ముందు నుండి అనుకుంటున్నట్టే ‘ఈగల్’ సినిమా వాయిదా పడింది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున దిల్ రాజు తెలిపారు.
అయితే అదే డేట్ కి ‘యాత్ర 2’ ‘టిల్లు స్క్వేర్’ వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఆ చిత్ర నిర్మాత నాగవంశీ ‘టిల్లు స్క్వేర్’ ను పోస్ట్ పోన్ చేసుకోవడానికి అంగీకరించినట్టు దిల్ రాజు తెలిపారు. ఇక ‘యాత్ర 2’ కూడా పోస్ట్ పోన్ చేయించి (Eagle) ‘ఈగల్’ కి సోలో రిలీజ్ వచ్చేలా చేస్తామని ఈ సందర్భంగా దిల్ రాజు హామీ ఇచ్చారు.