మెగాస్టార్ మూవీలో రవితేజ అలా కనిపిస్తారా?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో సినిమాల విషయంలో వేగం పెంచిన సంగతి తెలిసిందే. రీఎంట్రీలో రీమేక్ సినిమాలకు చిరంజీవి ఎక్కువగా ఓటేస్తున్నారు. అయితే బాబీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మాత్రం స్ట్రెయిట్ మూవీ అనే సంగతి తెలిసిందే. చిరంజీవిని అభిమానులు ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో బాబీ ఈ సినిమాలో అదే విధంగా చూపించనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కుతుండగా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. చిరంజీవి ఈ సినిమాలో అండర్ కవర్ కాప్ గా కనిపిస్తారని రవితేజ చిరంజీవి తమ్ముడిగా పోలీస్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఢోకా ఉండదని చిరంజీవి రా అండ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తారని సమాచారం.

ప్రముఖ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రవితేజకు జోడీగా ఈ సినిమాలో కేథరిన్ నటిస్తుండగా సినిమాలో ఈ దంపతులకు ఒక పాప ఉంటుందని బోగట్టా. యాక్షన్ థ్రిల్లర్ గా వాల్తేరు సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. సినిమాలో రవితేజ రోల్ కథను మలుపు తిప్పుతుందని బోగట్టా.

చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి అండర్ కవర్ కాప్ రోల్ లో నటించనున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రానుంది. చిరంజీవి అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవికి జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి శృతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి మూవీ ఇదే కావడం గమనార్హం. కథ, పాత్ర నచ్చితే సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి శృతి హాసన్ ఆసక్తి చూపిస్తున్నారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus