RAW మూవీ పోస్టర్ లాంచ్!!!

  • July 18, 2020 / 06:00 PM IST

కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ లో లక్ష్మీ డొక్కర సమర్పించు రాజు డొక్కర నిర్మాత మరియు దర్శకుడి గా నిర్మించిన చిత్రం పోస్టర్ లాంచ్ కార్యక్రమం తెలంగాణ సినిమాటోగ్రఫి మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు సీతాఫలమండి కార్పొరేటర్ సామల హేమ గారి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రా మూవీ సినిమాటోగ్రాఫర్ వి ఐ పి శ్రీ,కుమరన్,చంటి,మూవీ డైరెక్టర్ రాజు డొక్కర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ… డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ప్రాణ నష్టం జరుగుతుందని దానిని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీస్ శాఖ వారు చాలా కష్టపడుతున్నారు అని,ఇలాంటి సామాజిక అంశం తో మంచి మెసేజ్ తో కార్తీక్ క్రియేషన్స్ లో రా సినిమాను చిత్రీకరించినందుకు డైరెక్టర్ రాజు డొక్కర గారిని అభినందించాలి అని,ప్రజలు ఇలాంటి చిత్రాలను ఆదరించి,జాగ్రతలు పాటించాలి అని కోరుతూ సినిమా డైరెక్టర్ రాజు డొక్కర మరియు టీం సభ్యులను అభినందించారు.

సీతాఫలమండి కార్పొరేటర్ హేమ గారు మాట్లాడుతూ….. కార్తీక్ క్రియేషన్స్ లో రాజు డొక్కర నిర్మించి దర్శకత్వం వహించిన రా అనే చిత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ మీద తీశారు అని,యూత్ ఎక్కువగా ఇలాంటి వాటిల్లో ఇన్వొల్వెమెంట్ ఉంటుంది అని,ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీసిన రాజు డొక్కర గారికి మరియు టీం కి అభినందనలు తెలిపారు.

రా మూవీ డైరెక్టర్ రాజు డొక్కర మాట్లాడుతూ…. పోస్టర్ లాంచ్ చేసిన తలసాని శ్రీనివాస్ గారికి,హెంక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ….. డ్రంక్ అండ్ డ్రైవ్ లో హార్రర్ బ్యాక్ డ్రాప్ లో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీసామని, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది అని,పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అని,వైజాగ్,పార్వతీపురం, అరకు,హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రం రూపొందించామని,త్వరలో ఆడియో,ట్రైలర్ విడుదల చేస్తామని మీరు ఈ చిత్రం చూసి మమల్ని అభినందించాలని కోరారు.

రమణ లోడ్ ఎట్టాలిరా ఫేమ్ కుమరన్ గారు మాట్లాడుతూ…. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యూత్ తమ జీవితాలు పాడు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటుంది అని,దీని వల్ల పేరెంట్స్ చాలా బాధ పడుతున్నారు అని,దానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని కోరుతూ,ఈ మూవీ లో ముఖ్య విలన్ పాత్ర చేశానని ఈ అవకాశం ఇచ్చిన రాజు డొక్కర గారికి అభినందనలు తెలియజేశారు.

రా మూవీ సినిమాటోగ్రాఫర్ వి ఐ పి శ్రీ మాట్లాడుతూ….ఇలాంటి టైం లో మూవీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చెయ్యడం చాలా కష్టం అని,కానీ డైరెక్టర్ రాజు డొక్కర గారు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు అని అభినందించారు

రా మూవీ హీరో చంటి మాట్లాడుతూ…. ఈ సినిమా లో అందరిని పాడుచేసింది,చెడగొట్టింది నేనేనని తప్పుగా అనుకోవద్దు అని,ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ రాజు డొక్కర గారికి ధన్యవాదాలు తెలిపారు.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus