RC15: చరణ్, శంకర్ సినిమా.. మరింత ఆలస్యం!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. అయితే అనుకున్నట్లుగా ఈ సినిమా షెడ్యూల్స్ జరగడం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను 2023 సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ ఆలస్యమవుతుండడంతో.. రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

దర్శకుడు శంకర్ వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను రిలీజ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు. కానీ దిల్ రాజు మాత్రం సమ్మర్ మిస్ అయితే 2023 దసరాకి సినిమాను వదలాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు శంకర్ ‘ఇండియన్2’ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. ఆ కారణంగానే చరణ్ సినిమా ఆలస్యమవుతుంది. నెలలో కొన్ని రోజులు ‘ఇండియన్2’ సినిమా.. మరికొన్ని రోజులు చరణ్ సినిమా షూట్ చేస్తానని చెప్పారు శంకర్.

అయితే ఆయన ప్లాన్ చేసినట్లుగా షెడ్యూల్స్ జరగడం లేదు. ఎక్కువ రోజులు ‘ఇండియన్2’ సినిమాకే కేటాయించాల్సి వస్తుంది. ఈ విషయంలో దిల్ రాజు హ్యాపీగా లేనప్పటికీ.. ఏమీ అనలేని పరిస్థితి. రామ్ చరణ్ కూడా శంకర్ కారణంగా కొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. అయినప్పటికీ..

అనుకున్న సమయానికి సినిమా రెడీ కాకపోవచ్చు. అందుకే రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి జీస్టూడియోస్ సంత ఫైనాన్సింగ్ చేస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ లో దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus