గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో RC16 (RC16 Movie) సినిమా చేస్తున్నారు. ఉప్పెన (Uppena) సినిమాతో ఘన విజయం అందుకున్న బుచ్చిబాబు, తన రెండో చిత్రాన్ని మరింత ప్రెస్టీజియస్‌గా మలచాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ పాత్ర అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మాస్, క్లాస్ అంశాలతో కూడిన కథ ఇది. కానీ అసలు ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్‌లో ఉంటుందట.
రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సుకుమార్ అంధించిన రంగస్థలం(Rangasthalam) . ఆ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది క్లైమాక్స్ అని సినీ విశ్లేషకులు చెబుతారు. కథే ప్రధాన బలం అయినా, ఆఖరి సన్నివేశాలు కథను మరింత పదునెక్కించాయి. దీంతో రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వచ్చారు. ఇప్పుడు RC16 కోసం బుచ్చిబాబు సైతం అదే తరహాలో క్లైమాక్స్‌ను అత్యంత ఎమోషనల్‌గా మలచారని సమాచారం. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. అయితే కేవలం ఒక సాధారణ స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరపాటే.
అసలు క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని, ప్రేక్షకుల మనసుల్ని కదిలించేలా రూపొందించారని సమాచారం. ఇది చరణ్ కెరీర్‌లో మర్చిపోలేని క్లైమాక్స్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఈ కథలో ఏం ప్రత్యేకత ఉందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇది ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయ చిత్రమవుతోంది. ఇక సంగీత పరంగా సినిమాకు అదనపు ఆకర్షణ ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం.
అతడి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్లైమాక్స్‌ను మరింత ప్రభావవంతంగా మలుస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది. RC16 ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ట్రీట్మెంట్ పరంగా హాలీవుడ్ స్థాయిలో సినిమాను మలచనున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది, త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.