3 ఏళ్లలో 40 లక్షల నుంచి 20 కోట్లకు.. సాలిడ్ రెమ్యునరేషన్!

Ad not loaded.

సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితేనే హీరోలు, హీరోయిన్లు రెమ్యునరేషన్ పరంగా మరో రేంజ్‌కు చేరిపోతుంటారు. అయితే వెబ్‌సిరీస్ రంగంలోనూ ఇప్పుడు అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒక మంచి కంటెంట్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ఆ నటుడికి ఆఫర్లు రావడమే కాదు, పారితోషికం కూడా ఆకాశాన్నంటుతుంది. తాజాగా ఈ జాబితాలో చేరిన పేరు జైదీప్ అహలావత్ (Jaideep Ahlawat). ‘పాతాళ్ లోక్’ (Paatal Lok) వెబ్‌సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు స్టార్స్ ను మించిపోయే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. 2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ‘పాతాళ్ లోక్’ భారీ విజయం సాధించింది.

Jaideep Ahlawat

ఈ వెబ్‌సిరీస్‌లో హతీరాం చౌదరి పాత్ర పోషించిన జైదీప్ అహలావత్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని ఈ నటుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆయనకు సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు ‘పాతాళ్ లోక్ 2’ (Paatal Lok 2)  రాబోతుండడంతో మరోసారి ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ‘పాతాళ్ లోక్’ మొదటి సీజన్ కోసం జైదీప్ కేవలం రూ.40 లక్షల పారితోషికం మాత్రమే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు సీజన్ 2 కోసం ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మూడు ఏళ్ల వ్యవధిలోనే ఆయన రెమ్యునరేషన్ ఊహించని స్థాయికు చేరింది. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ పెరగడం బాలీవుడ్ వెబ్‌సిరీస్ రంగంలోనే సెన్సేషన్‌గా మారింది. ఇంతటి రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చారని పరిశీలిస్తే, జైదీప్ అహలావత్ పాత్ర ఈ సిరీస్‌లో కీలకమైనది. మొదటి సీజన్ ఘన విజయం సాధించడంతో, ప్రేక్షకులు రెండో సీజన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ బడ్జెట్‌లో మెజారిటీ భాగాన్ని జైదీప్ రెమ్యునరేషన్‌కి కేటాయించారని తెలుస్తోంది.

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలకు కూడా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వరు, కానీ జైదీప్ ఈ స్థాయికి చేరడం నిజంగా షాకింగ్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ‘పాతాళ్ లోక్ 2’ సక్సెస్ అయితే జైదీప్ స్టార్‌డమ్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది. వెబ్‌సిరీస్ రేంజ్‌ను మార్చిన ‘పాతాళ్ లోక్’ మరోసారి సత్తా చాటితే, జైదీప్ రెమ్యునరేషన్ వచ్చే రోజుల్లో మరింత పెరగడం ఖాయం. మరి, ఈ సిరీస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

పుష్ప 2 సక్సెస్ వెనుక 10 ఏళ్ల స్ట్రాటజీ.. బన్నీ ప్లాన్ అదిరిందే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus