ఇలా లీకవ్వడమే అలా వైరల్.. మామూలుగా లేదు..!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధించిన చిత్రం ఏమైనా ఉందా అంటే.. వెంటనే చెప్పే పేరు ‘కె.జి.ఎఫ్’. సాధారణంగా కన్నడ సినిమాలకు అంత హడావిడి ఉండదు. కనీసం సినిమాలో తెలిసిన క్యాస్టింగ్.. ఐటెం సాంగ్ చేసిన తమన్నా తప్ప మరెవ్వరూ లేరు. అయినా సరే ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నార్త్ లో కూడా ఈ చిత్రం అంచనాలకు మించిన బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్కడి బయ్యర్స్ కు ‘రూపాయికి 5 రూపాయలు లాభాలు’ వచ్చాయి.

‘తెలియని క్యాస్టింగ్ ఉంటేనే ఇంత పెద్ద హిట్ అయ్యింది.. అదే తెలిసిన క్యాస్టింగ్ ఉంటే.. ఇక ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో’ అని భావించి ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లో పెద్ద క్యాస్టింగ్ నే ఎంచుకున్నారు. తెలుగు నుండీ రావు రమేష్ ను తీసుకున్నారు. బాలీవుడ్ నుండీ రవీనా టాండన్ కూడా నటిస్తుంది. అయితే మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు. అధీరా పాత్రలో ఇతను కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ ఇతని ఫేస్ చూపిస్తూ.. ఒక్క లుక్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చెయ్యలేదు.

కానీ ఇప్పుడు ఓ లుక్ లీకయ్యింది. వెంటనే అది వైరల్ గా కూడా మారిపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సంజయ్ దత్ లుక్ ను తెగ షేర్ చేస్తున్నారు. దీనిని బట్టే చెప్పొచ్చు.. ఈ సీక్వెల్ పై ఎంత క్రేజ్ ఉందన్న విషయం. ఇక అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది కాబట్టి.. అది సాధ్యం కాకపోవచ్చు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus