మారుతి, అల్లు అర్జున్ సినిమా కాంబో ఆగిపోవడానికి కారణం ఇదే

బూతు చిత్రాల దర్శకుడిగా మొదట్లో పేరు తెచ్చుకున్న మారుతి ఆ తర్వాత ఆ పేరుని పోగొట్టుకున్నారు. మంచి సినిమాలను తీసి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా మారుతి దర్శకత్వంలో నటించాలని ఉందని బహిరంగంగానే చెప్పారు. ఒక్క హిట్ అందుకుంటే చాలు.. స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్లాన్ వేస్తున్న ఈ కాలంలో అల్లు అర్జున్ వంటి హీరో పిలిచి అవకాశమిచ్చినా మారుతి వినియోగించుకోలేదు. తన కథకు నప్పే హీరోలతోనే సినిమా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేసారని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే స్టార్ డైరక్టర్ల జాబితాలో స్థానం సంపాదించుకోవచ్చు. హోదాతో పాటు రెమ్యునరేషన్ పెరిగిపోతుంది. అదే విధంగా ప్రమాదం కూడా ఉంది. స్టార్ హీరో సినిమాని సరిగా హ్యాండిల్ చేయకుంటే..

ఆ తర్వాత అవకాశం రావడం గగనమయిపోతుంది. రీసెంట్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేసి, అవి ఫెయిల్ కావడంతో మెగా ఫోన్ కి దూరమయిన డైరక్టర్స్ కొంతమంది ఉన్నారు. అందుకే ఆరాటపడి పరిశ్రమకి దూరంగా కావడం కంటే.. తన స్థాయి హీరోలతో సినిమాలు చేసుకుంటూ ఎక్కువకాలం పరిశ్రమలో కొనసాగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ అత్తగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus