ఎన్ఠీఆర్ కుమారుడిగా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తనదైన నటనతో , డాన్సులతో తనని తాను స్టార్ గా మలచుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. అభిమానులు ఆయన్ని ప్రేమగా బాలయ్య అని పిలుచుకుంటారు. అయితే అభిమానులంటే బాలయ్య కు కూడా అమితమైన ప్రేమ. బాలయ్య మనసు లోపల ఒకలా బయట ఒకలా ఉండటం రాని మనిషి.ఏదయినా మొహం మీదే చెప్తూ కల్మషం లేని చిన్న పిల్లాడి మనస్తత్వం బాలయ్య సొంతం.
అయితే ఈ మధ్య బాలయ్య విశాఖలో ఒక అభిమానిపై కోపం తో ఊగిపోయారు. దాని వెనుక కారణం ఏంటి అనేది అక్కడ ఉన్న వాళ్లకు అర్ధం కాలేదు. చిన్న పిల్లలతో సైతం ఒదిగిపోయి ఉండే బాలయ్య, తప్పుగా ప్రవర్తిస్తే సొంత అభిమాని అయినా అసలు ఏ మాత్రం ఊరుకోడు. దీనిపై స్పందిస్తూ అఖండ 2 నిర్మాతలు రామ్ ఆచంట , గోపి ఆచంట ఈ విధంగా మాట్లాడారు. ఆ సందర్భానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల వల్లనే ఆయన ఆ రోజు అలా భగ్గుమన్నారు కానీ ఆయనకు అభిమానులు అంటే ప్రాణం అని చెప్పుకొచ్చారు. అయన చీమకు కూడా హాని తలపెట్టని తత్త్వం కలిగిన మంచి మనిషి అనేసి చెప్పారు.
డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వబోతున్న అఖండ 2 కోసం నందమూరి అభిమానులే కాకుండా మొత్తం సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకు అంటే ఈ మూవీ బాలయ్య-బోయపాటి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 4వ చిత్రం. ఇప్పటివరకు ఈ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానికి మించి ఒకటి బ్లాక్ బస్టర్లుగా నిలవటంతో రాబోతున్న అఖండ 2 పై వీపరీతమైన హైప్ ఉంది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.