ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి , మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ” అనగనగా ఒక రాజు “. ఈ మూవీ పొంగల్ బరిలో పోటీ పడటానికి సిద్ధం అవుతుంది. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు. ప్రతి పండుగకు ఏదొక అప్డేట్ ఇస్తూ 2026 సంక్రాంతికి కచ్చితంగా వస్తున్నాం అంటూ ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. అయితే భీమవరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో ఈవెంట్ నిర్వహించి ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసారు. భీమవరం బాల్మ అంటూ సాగే ఈ సాంగ్ ను స్వయంగా హీరో నవీన్ పొలిశెట్టి యే పాడాడు. ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూర్చారు.
సినిమాలంటే ఎంతో మక్కువ ఉన్న నవీన్, చాలా ప్రయత్నాల తరువాత ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ ద్వారా హీరో గా పరిచయం అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆత్రేయ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సషనల్ హిట్ కావటమే కాక నవీన్ టైమింగ్ , టాలెంట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత క్రేజీ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ శెట్టి పోలిశెట్టి కూడా హిట్ అవ్వటంతో నవీన్ తదుపరి మూవీస్ పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. కానీ సడన్ గా గ్యాప్ తీసుకున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తరువాత ఇంతవరకు మూవీ రాలేదు తన నుంచి, దాని గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు నవీన్.
తనకు ఒక మేజర్ ఆక్సిడెంట్ జరిగింది అని , చెయ్యి విరగటంతో పాటు ఇంకా చాలా గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను చాలా బాధ పడ్డానని , అసలు తిరిగి ఎప్పుడు మళ్ళ్లీ ప్రేక్షకుల ముందుకి వస్తానో అని మదన పడ్డట్టు చెప్పారు. కానీ ఈ రోజు మల్లి ఇక్కడ నిలబడ్డాను అంటే అది ప్రేక్షకుల అభిమానం, ప్రేమ వల్లనేనని అన్నారు. అదే ఎనర్జీతో భీమవరం బాల్మ సాంగ్ పాడాను అని అభిమానుల్ని మెప్పించటానికి తాను దేనికైనా రెడీ అని అన్నారు.
సంక్రాంతి బరిలో స్టార్ హీరోస్ తో పాటు సమరానికి సిద్దమవుతున్న అనగనగా ఒక రాజు ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి..!