గ్యారేజ్ ఆడియోలో కల్యాణ్ రామ్ లేడు….కారణం!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో వేడుక నిన్న అంగరంగ వైభవంగా, అభిమానుల కోలాహాల మధ్య జరిగింది. అయితే ఎంతో ఉత్సాహంతో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్  ఆడియో పాటలు విని అన్నీ బావుండడంతో సినిమా సూపర్ హిట్ అని అప్పుడే అంచనాలు వచ్చేశారు. ఇదిలా ఉంటే నిన్న ఎన్టీఆర్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆయన అభిమానుల పై చూపించిన ప్రేమ అందరినీ ఎన్టీఆర్ కు మరింత దగ్గర చేసింది.

అయితే అదే క్రమంలో ఆ కార్యక్రమానికి అతిరధమహరదులు అందరూ అటెండ్ అయినా అన్న కల్యాణ్ రామ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే గత నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకల్లో ఎన్టీఆర్ కు చాలా దగ్గరగా ఉన్న కల్యాణ్ రామ్, ఈ ఆడియోలో కనిపించక పోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు. వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ వ్యక్తిగత కారణాలు ఉన్నాయని, అందుకే వచ్చే అవకాశం ఉన్నా కల్యాణ్ రామ్ రాలేదని తెలుస్తుంది.

అయితే అదే క్రమంలో కల్యాణ్ రామ్ రాకపోవడానికి అసలు కారణం, కల్యాణ్ రా, పూరీ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఇజమ్’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండడంతో రావడం కుదరలేదు అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఏది నిజమో..ఎంతవరకూ నిజమో…వారికే తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus