అసలే సినిమా అంటే బిజినెస్ గా మారిపోయిన కాలం, అదే క్రమంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, మరో పక్క నందమూరి అండ రెండూ కలగలిపి నారా వారి అబ్బాయి నారా రోహిత్ నిర్మాతగానే డిస్‌ట్రిబ్యుటర్ గానో చెలరేగిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి కానీ….ఒక హీరోగా అతి తక్కువ బడ్జెట్ లో సూపర్ హిట్స్ తీస్తూ చెలరేగిపోతున్నాడు…అయితే ఇదిలా ఉంటే అనుకోకుండా నారా రోహిత్ హీరో నుంచి నిర్మాత అవతారం ఎత్తాడు…అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమాని తనే నటించి నిర్మించాడు….అదేంటి సడన్ గా నిర్మాతగా మారడానికి అసలు కారణం ఏంటి అని అంటే ఆయన మాటల్లోనే వినండి…‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను ‘అసుర’ దర్శకుడు కృష్ణవిజయ్.. ప్రశాంతిలతో కలిసి తనే స్వయంగా నిర్మించిన రోహిత్ ఆ సినిమా గురించి ఏం చెప్తున్నాడు అంటే…‘‘అప్పట్లో ఒకడుండేవాడు మామూలు కథ కాదు.
ఇది నా మనసుకు ఎంతగానో నచ్చిన చిత్రం. ఇందులో ఎన్నో అంశాలు చూపించాం. దర్శకుడు 90ల నాటి నేపథ్యంలో అనేక ఆసక్తికర అంశాల్ని చర్చించాడు. ఇలాంటి కథను రెండు గంటల్లో చెప్పడం చాలా కష్టం. ఇందులో చాలా రిస్క్ ఉంది. నాకు స్క్రిప్టు బాగా నచ్చడం వల్లనే ఈ సినిమాను నేనే నిర్మాతగా మారి తియ్యలి అని అనుకున్నా..ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాం అని రోహిత్ అన్నాడు. నేనే నిర్మాత కాబట్టి.. సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి రీషూట్లు చేయడానికి కూడా వెనుకాడలేదు. మరొకరైతే ఇందుకు అవకాశముండేది కాదు అని అన్నాడు….నిజమే అదే క్రమంలో ఈ రోజే విడుదలయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రోహిత్ పడ్డ కష్టం ఫలితాన్ని ఇచ్చింది అనే చెప్పాలి..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.